
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇది 27వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇందుకోసం తగిన సన్నాహాకాలు కూడా చేసుకున్నాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్ రికార్డులు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చేసిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి కావడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విరాట్ కోహ్లీ సగటు 53గా ఉండడం విశేషం. ఢిల్లీపై 25 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 53 సగటుతో 913 పరుగులు చేశాడు. 135 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఎనిమిది సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా అత్యధిక స్కోర్ 99 పరుగులుగా ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తే ఆర్సీబీ తిరుగుండకపోవచ్చు. ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ టచ్‌లోనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆ లోటును తీరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రత్యర్థి కూడా గతంలో కోహ్లీకి బాగా కలిసొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కావడంతో ఇక తిరుగుండకపోవచ్చని భావిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు:
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, మన్‌దీప్ సింగ్, శ్రీకర్ భరత్, టిమ్ సీఫెర్ట్ .
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేసాయి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ విల్లేవుడ్, సిద్దార్థ కౌల్ , షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కర్ణ్ శర్మ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, అనీశ్వర్ గౌతమ్