IPL 2022: ఆర్సీబీపై ధోనికి.. సీఎస్కేపై కోహ్లీకి టాప్ రికార్డులు.. నేటి మ్యాచ్‌లో ఇక హోరాహోరీనే!

ఐపీఎల్ 2022లో నేడు సూపర్ మ్యాచ్ జరగనుంది. టాప్ టీమ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నైసూపర్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇది 22వ మ్యాచ్. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సీఎస్కేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉండడం, అలాగే ఆర్సీబీలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండడంతో అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీపై ధోనికి, సీఎస్కేపై కోహ్లీకి మంచి రికార్డులు కూడా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా ఆడతారనే ఆసక్తి నెలకొంది. కోహ్లీ, ధోని ఇద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండడం గమనార్హం.

ఆర్సీబీపై అత్యధిక రన్స్ ధోనివే
ఐపీఎల్‌లో రాయాల్ చాలెంజర్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. ఆర్సీబీపై 31 మ్యాచ్‌లు ఆడిన ధోని 41 సగటుతో 836 పరుగులు చేశాడు. 141 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయగా 5 సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లోనూ ధోని తన రికార్డును కొనసాగిస్తూ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ధోని తర్వాత ఆర్సీబీపై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఆర్సీబీపై ఇప్పటివరకు 785 పరుగులు చేశాడు.

సీఎస్కేపై అత్యధిక రన్స్ కోహ్లీవే
ఇక చెన్నైసూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. సీఎస్కేపై 28 మ్యాచ్‌లాడిన కోహ్లీ 41 సగటుతో 948 పరుగులు చేశాడు. 127 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 9 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో నేటి మ్యాచ్‌లో సీఎస్కేపై విరాట్ కోహ్లీ తన రికార్డును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ తర్వాత సీఎస్కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్ ఇప్పటివరకు 941 పరుగులు చేశాడు.
బోణీ కోసం చెన్నై ఆరాటం
ఐపీఎల్‌లో ఇప్పటివరకు బోణీ చేయని చెన్నైసూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, రాజవర్థన్ హంగర్గేకర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వానిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications