తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు
విరాట్ కోహ్లీ మరొక ఫోర్ బాదితే ఐపీఎల్‌లో 550 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 550 ఫోర్లు, 200కు పైగా సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అయితే కోహ్లీ ఈ రికార్డును నేడు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే మ్యాచ్‌లోనే అందుకునే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 549 ఫోర్లు, 212 సిక్సులు బాదాడు. కాగా ఐపీఎల్ ఇప్పటివరకు 209 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 37 సగటుతో 6336 పరుగులు చేశాడు. ఇందులో 42 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 113 పరుగులుగా ఉంది.

పూర్తి జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్‌వెల్, అనీశ్వర్ గౌతమ్.

రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్‌కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్


Click it and Unblock the Notifications












