|
ఓరి దేవుడా?
దాంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. విరాట్ మాత్రం ఔట్ కాదని, డొక్కలో తాకిందని సైగ చేస్తూ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌ను మిస్సై అతని గ్లోవ్స్‌ను ముద్దాడినట్లు కనిపించింది. స్నీకో మీటర్లో గీత రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక ఇలా ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఓ దేవుడా.. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది.'అని గట్టిగా అరుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. విరాట్ కోహ్లీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
|
వెంటాడుతున్న దురదృష్టం
విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోలేదని, పరిస్థితులు అతనికి ఏ మాత్రం కలిసి రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక విరాట్ ఇలా దురదృష్టవశాత్తు ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ సీజన్లో అంపైర్ల తప్పిదానికి కూడా అతను బలయ్యాడు. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 236 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు అనువైన తాజా మ్యాచ్‌లో మంచి మూమెంటమ్ అందుకున్న తర్వాత ఔటవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం
...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఆర్సీబీ 104 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.