Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2022లో నయా ట్రెండ్: రాయల్ ఛాలెంజర్స్‌తో ఆరంభం: ఆ మాజీల కోసం

IPL 2022: Virat Kohli announced Ab De Villiers and Chris Gayle RCBs First Two Hall Of Fame cricketers

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నమెంట్ ఇక ముగింపుదశకు వచ్చేసింది. ఈ నెల 22వ తేదీ నాటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మినహా అన్ని జట్లూ ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇవ్వాళ్టి మ్యాచ్‌తో సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ కూడా చివరి రౌండ్‌కు వచ్చేస్తాయి. బుధవారం నుంచి చివరి లీగ్స్ మొదలవుతాయి. లక్నో సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఇది ప్రారంభమౌతుంది.

కొత్త ట్రెడీషన్

సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో ముగుస్తుంది. వచ్చే మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ ఉంటాయి. కాగా- టోర్నమెంట్ చివరిదశకు వచ్చిన నేపథ్యంలో ఓ కొత్త సంప్రదాయం ఐపీఎల్‌లో కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దీన్ని ఆరంభించింది. హాల్ ఆఫ్ ఫేమ్ ట్రెడీషన్‌కు బీజం వేసింది. ఇద్దరు మాజీ ప్లేయర్లను దీనికోసం ఎంపిక చేసింది. ఐపీఎల్ ప్రస్థానంలో జట్టు విజయాల కోసం వారి శ్రమకు గౌరవంగా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు‌ను ప్రకటించింది.

హాల్ ఆఫ్ ఫేమ్‌గా

హాల్ ఆఫ్ ఫేమ్‌గా

రాయల్ ఛాలెంజర్స్ మాజీ కేప్టెన్, బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ ఇద్దరు హాల్ ఆఫ్ ఫేమ్ ప్లేయర్ల పేర్లను ప్రకటించాడు. ఆ ఇద్దరి జెర్సీ నంబర్లతో కూడిన మొమెంటోను ఆవిష్కరించారు. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఇద్దరూ- కరేబియన్ విధ్వంసకారుడు క్రిస్ గేల్.. దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్. తమ ఫ్రాంఛైజీకి చేసిన సేవలను గుర్తిస్తూ ఆ ఇద్దరినీ హాల్ ఆఫ్ ఫేమ్‌ అవార్డ్ కోసం ఎంపిక చేసినట్లు విరాట్ కోహ్లీ చెప్పారు.

జెర్సీ నంబర్లతో..

ఇదివరకు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్- రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. క్రిస్ గేల్ జెర్సీ నంబర్ 333, ఏబీ డివిలియర్స్ జెర్సీ నంబర్ 17. వారి గౌరవార్థం ఈ రెండు నంబర్లతో ప్రత్యేకంగా మొమెంటోలను తయారు చేయించింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. వాటిని విరాట్ కోహ్లీ ఆవిష్కరించారు. ఫ్రాంఛైజీ లోగో, జెర్సీ నంబర్, వారి పేర్లను క్లుప్తంగా దీనిపై ముద్రించారు. క్రిస్ గేల్‌తో కలిసి మ్యాచ్‌లను ఆడటం ఓ అద్భుతమని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

అదో గొప్ప అనుభూతి..

2016 సీజన్‌లో క్రిస్ గేల్‌తో కలిసి అప్పటి గుజరాత్ జట్టుపై నమోదు చేసిన భాగస్వామ్యాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో వన్ మ్యాన్ షో సాగిందని పేర్కొన్నాడు. ఆధునిక క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కించాడని ఏబీ డివిలియర్స్‌ను ప్రశంసించాడు. ఎన్నో కొత్త కోణాల్లో షాట్లను ఆడటం అతని వల్ల చూడగలిగామని కితాబిచ్చాడు. ప్లే బోల్డ్ ఫిలాసఫీని ఆర్సీబీలో చొప్పించాడని అన్నాడు.

మరిచిపోలేని ప్రయాణం..

మరిచిపోలేని ప్రయాణం..

హాల్ ఆఫ్ ఫేమ్ పట్ల క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. తన కేరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీతో కలిసి సాగించిన ప్రయాణం.. మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. ఎన్నో జ్ఞాపకాలను అందించిందని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 17, 2022, 12:04 [IST]
Other articles published on May 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+