IPL 2022: తగ్గెదేలే! లేటు వయసులోనూ శిఖర్ ధావన్ విధ్వంసం.. వరుసగా 3 సీజన్లలో 500+ రన్స్

టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ లేటు వయసులోనూ తగ్గెదేలే అంటున్నాడు. పరుగుల వరద పారించే ఐపీఎల్‌లో వరుసగా 3 సంవత్సరాలుగా 500కు పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో కూడా ధావన్ చెలరేగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు 36 ఏళ్ల ధావన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో గత సీజన్ల మాదిరిగా ధావన్ ఈ సారి కూడా చెలరేగితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవని చెప్పుకోవాలి.

3 సీజన్లలో 500+ రన్స్
శిఖర్ ధావన్ గత 3 ఐపీఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు. 2019లో 521 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఇక 2020లో ఏకంగా 618 పరుగులు బాదేశాడు. గత ఏడాది కూడా చెలరేగిన ధావన్ 587 పరుగులు చేశాడు. ఇలా వయసు 35 దాటినప్పటికీ పరుగుల వరద పారిస్తూ బౌలర్లకు శిఖర్ ధావన్ చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022లో కూడా శిఖర్ ధావన్ ఇదే రేంజులో చెలరేగి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అత్యధిక బౌండరీలు
ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ ఓ చరిత్రాత్మక రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ముగిసిన ఐపీఎల్‌లో ఫోర్లు, సిక్సులు కలిపి అత్యధిక బౌండరీలు బాదిన రికార్డు ధావన్ అందుకున్నాడు. మొత్తంగా 778 బౌండరీలతో ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ఇందులో ఇందులో 654 ఫోర్లు, 124 సిక్సులు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో 761 బౌండరీలతో క్రిస్ గేల్ రెండో స్థానంలో, 756 బౌండరీలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, 726 బౌండరీలతో డేవిడ్ వార్నర్ నాల్గో స్థానంలో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 718 బౌండరీలతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

పంజాబ్ కొనుగోలు
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శిఖర్ ధావన్‌ను ఈ సారి ఆ జట్టు మెగా వేలంలోకి వదిలేసింది. దీంతో వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ 8 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో ఈ గబ్బర్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం పంజాబ్ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ జట్టు మెనేజ్‌మెంట్ మాత్రం మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గు చూపడంతో ధావన్‌కు నిరాశ తప్పలేదు.

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు
మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75 కోట్లు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్(రూ.40 లక్షలు), ఓడిన్ స్మిత్(రూ.6 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రేరక్ మన్కండ్(రూ.20 లక్షలు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), అథర్వ టైడ్(రూ.20 లక్షలు), వ్రిట్టిక్ చటర్జీ(రూ.20 లక్షలు), బాల్‌తేజ్ ధండా(రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications