Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నక్కతోక తొక్కిన సన్‌రైజర్స్‌ స్పీడ్‌స్టర్‌: టీమిండియాలో బెర్త్ కన్‌ఫర్మ్: ఆ సిరీస్ కోసం సన్నద్ధం

IPL 2022: Umran Malik likely to picked in Team India for Upcoming T20 Series against South Africa

ముంబై: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఆరు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో తిరుగులేని విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడినప్పటికీ.. కేన్ విలియమ్సన్ సేన- బౌన్స్ బ్యాక్ అయిన తీరు అద్భుతం. జట్టు మొత్తం సమష్టిగా సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ డిపార్ట్‌మెంట్లల్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

నెక్స్ట్ మ్యాచ్ బెంగళూరుతో..

నెక్స్ట్ మ్యాచ్ బెంగళూరుతో..

తన తరువాతి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోందీ ఆరెంజ్ ఆర్మీ. శనివారం ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓటమిపాలైనప్పటికీ.. ఆ తరువాత పుంజుకొంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్‌ను మట్టి కరిపించింది.

బౌలింగ్ వింగ్ కీలకం..

బౌలింగ్ వింగ్ కీలకం..

సన్‌రైజర్స్ సాధిస్తోన్న విజయాల్లో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ పోషిస్తోన్న పాత్ర కీలకం. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో విషయం క్లియర్ కట్‌గా తేలింది. భారీ స్కోర్ దిశగా సాగుతున్న పంజాబ్‌ బ్యాటర్ల దూకుడుకు సన్‌రైజర్స్ బౌలర్లు కళ్లెం వేసిన తీరు ఓ మాస్టర్ పీస్. డెత్ ఓవర్లలో బౌలర్లు నిప్పులు చెరిగారు. టీ20 వంటి ధనాధన్ ఫార్మట్‌లో చివరి అయిదు ఓవర్లల్లో 19 పరుగులు మాత్రమే ఇవ్వడం- సన్‌రైజర్స్ బౌలర్ల స్టామినాకు అద్దం పట్టింది.

ఉమ్రాన్ మాలిక్ ఫైర్..

ఉమ్రాన్ మాలిక్ ఫైర్..

భువనేశ్వర్ కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 2018 తరువాత ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లను తీసుకోవడం ఇదే తొలిసారి. సన్‌రైజర్స్ ఇన్నింగ్‌లో హైలైట్‌గా చెప్పుకోదగ్గది- చివరి ఓవర్. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మలిక్ దీన్ని సంధించాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు నేలకూల్చాడు. ఒడియన్ స్మిత్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరాలను బలి తీసుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు.

సెలెక్టర్ల దృష్టిలో పడినట్టే..

సెలెక్టర్ల దృష్టిలో పడినట్టే..

ఉమ్రాన్ మాలిక్‌లో కనిపించిన ఆ ఫైర్.. అభిమానులనే కాదు రాజకీయ నాయకులను సైతం కట్టి పడేసింది. అతణ్ని జాతీయ జట్టు సెలెక్ట్ చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సూచించారు. ఆ ఫైర్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసినట్టే. దక్షిణాప్రికాతో తలపడబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లోనే ఈ సిరీస్ ఆరంభం కాబోతోన్నందున.. దేశీయ పిచ్‌లపై నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్‌కు బీసీసీఐ బెర్త్ కన్‌ఫర్మ్ చేయొచ్చని తెలుస్తోంది.

అయిదు మ్యాచ్‌ల సిరీస్..

అయిదు మ్యాచ్‌ల సిరీస్..

అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

Story first published: Tuesday, April 19, 2022, 13:26 [IST]
Other articles published on Apr 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+