Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్స్‌ప్రెస్ వేగంతో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌.. ఫాస్టెస్ట్ డెలివ‌రీ అవార్డుల‌న్నీ అత‌ని ఖాతాలోనే!

IPL 2022: Umran Malik has won the Fastest Delivery Awards in played 5 matches

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ త‌న బౌలింగ్‌లోని వేగంతో బ్యాట‌ర్ల‌ను వ‌ణికిస్తున్నాడు. 150 కిలో మీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాట‌ర్ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్నాడు. ప్ర‌తి బంతిని క‌నీసం 140 కిలో మీట‌ర్ల‌కుపైగా వేగంతో వేస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక వేగంతో బౌలింగ్ చేస్తున్న బౌల‌ర్ల జాబితాలో ఉమ్రాన్ మాలిక్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన అత్య‌ధిక వేగ‌వంత‌మైన బాల్ ఉమ్రాన్ మాలిక్ పేరు మీద‌నే ఉంది. ఉమ్రాన్ మాలిక్ అత్య‌ధికంగా 153 కిలో మీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇలా త‌న ఎక్స్‌ప్రెస్‌ వేగంతో ఉమ్రాన్ మాలిక్‌ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ డెలివ‌రీ అవార్డుల‌ను గెలుచుకోవ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆడిన‌ ఉమ్రాన్ మాలిక్ ఐదు ఫాస్టెస్ట్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ప‌రిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఆడే అన్ని మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివ‌రీ అవార్డుల‌ను గెలుచుకునేలా ఉన్నాడు. కాగా జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ గ‌తేడాది కూడా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకే ప్రాతినిధ్యం వ‌హించాడు. దీంతో ఈ సారి మెగా వేలానికి ముందే ఉమ్రాన్ మాలిక్‌ను స‌న్‌రైజ‌ర్స్ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లాడిన ఉమ్రాన్ మాలిక్ 7 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 2/27గా ఉన్నాయి.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి జ‌ట్టు
కేన్ విలియమ్సన్(కెప్టెన్), అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ

Story first published: Saturday, April 16, 2022, 17:09 [IST]
Other articles published on Apr 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+