Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: దేవుడా! గంట‌కు 155 కి.మీ. వేగంతో ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ బౌన్స‌ర్లు.. ఈ సారి రికార్డులు బ‌ద్ద‌లే

IPL 2022: Umran Malik Bowls 155 KMPH In SRH Practice Session Fast Bowling Records Are Likely To Be Broken

హైద‌రాబాద్‌: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రాక్టీస్ సెష‌న్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా మారింది. ప్రాక్టీస్ సెష‌న్‌లో 22 ఏళ్ల ఈ యువ బౌల‌ర్ గంట‌కు 155 కిలో మీట‌ర్ల వేగంతో బౌన్స‌ర్లు వేస్తూ బ్యాట‌ర్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడు చేయ‌గా నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం నికోలస్ పూర‌న్ బ్యాటింగ్ చేస్తుండ‌గా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. అత‌డు 155 కిలో మీట‌ర్ల వేగంతో విసిరిన మొద‌టి బౌన్స‌ర్‌ను పూర‌న్ స‌రిగ్గా ఆడ‌లేక‌పోయాడు. రెండో బంతిని కూడా ఉమ్రాన్ మాలిక్ అలాగే బౌన్స‌ర్‌గా వేయ‌డంతో ఫీల్డ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

నిజానికి 150 కిలో మీట‌ర్ల వేగంతో బంతులు వేసే బౌల‌ర్లు చాలా అరుదుగా ఉంటారు. స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే అటువంటి బౌల‌ర్లు సునాయసంగా సక్సెస్ అవుతారు. దీంతో బౌల‌ర్ల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చెప్పుకోవాలి. అయితే జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన‌ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లోనూ ఇదే వేగంతో బౌలింగ్ చేస్తే రికార్డులు బ‌ద్ద‌ల‌య్యే అవకాశం ఉంది.

IPL 2022: Bheemla Nayak Tagline For SRH మనల్ని ఎవడ్రా ఆపేది Manalni Evadra Aapedhi| Oneindia Telugu

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కుతాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను ఈ నెల 29న ఆడ‌నుంది. 29న తొలి మ్యాచ్‌లో రైజ‌ర్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి జ‌ట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, గదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జరొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ఫజల్హాక్ ఫరూకీ.

Story first published: Thursday, March 24, 2022, 12:04 [IST]
Other articles published on Mar 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+