Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: తొలి ఓవ‌ర్ల‌నే వికెట్లు.. ప‌వ‌ర్‌ప్లేలో రికార్డు.. ఉమేష్ భాయ్ నిన్ను మించినోడు లేడుపో!

IPL 2022: Umesh Yadav taken wickets in his first over in three consecutive games And completed 50 wickets in powerplay

ఐపీఎల్ 2022లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ చెల‌రేగుతున్నాడు. త‌న అనుభ‌వాన్ని అంతా ఉప‌యోగించి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. 34 ఏళ్ల వ‌య‌సులోనూ కచ్చితమైన బంతులతో స్టార్ బ్యాటర్లను సైతం వణికిస్తున్నాడు. త‌న అద్భుత బౌలింగ్‌తో ఆరంభ ఓవ‌ర్లోనే వికెట్ తీస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. అలాగే ప‌వ‌ర్‌ప్లేలో 50 వికెట్ల మార్క్‌ను కూడా ఉమేష్ యాద‌వ్ చేరుకున్నాడు.

తొలి ఓవ‌ర్లోనే వికెట్

తొలి ఓవ‌ర్లోనే వికెట్

ఐపీఎల్ 2022లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ పేస‌ర్ ఉమేష్ యాద‌వ్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీసి ప్ర‌త్య‌ర్థుల‌ను దారుణంగా దెబ్బ‌కొట్టాడు. సీఎస్కేతో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్లో ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌ను డ‌కౌట్ చేశాడు. ఉమేష్ యాద‌వ్ బౌలింగ్‌లో రుతురాజ్.. నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. గ‌త సీజ‌న్లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో ఉమేష్ యాద‌వ్ దెబ్బ‌కు డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం.

వ‌రుస‌గా 3 మ్యాచ్‌ల్లో

వ‌రుస‌గా 3 మ్యాచ్‌ల్లో

ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఉమేష్ యాద‌వ్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. ఆ జ‌ట్టు ఓపెన‌ర్ అనుజ్ రావత్‌ను డ‌కౌట్ చేశాడు. ఉమేష్ బౌలింగ్‌లో జాక్స‌న్‌కు క్యాచ్ ఇచ్చి అత‌ను ఔటయ్యాడు. ఇక తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఉమేష్ యాద‌వ్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. పంజాబ్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను ఒక్క ప‌రుగుకే ఎల్బీలో ఔట్ చేశాడు. దీని ద్వారా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల్లోనే వ‌రుస‌గా 3 మ్యాచ్‌ల్లో తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీసిన బౌల‌ర్‌గా ఉమేష్ యాద‌వ్ నిలిచాడు.

ప‌వ‌ర్‌ప్లేలో రికార్డు

కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీయ‌డం ద్వారా కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ పేస‌ర్ ఉమేష్ యాద‌వ్ ఐపీఎల్‌లో ప‌వ‌ర్‌ప్లేలో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అలాగే ప‌వ‌ర్‌ప్లేలో 50 వికెట్లు తీసిన నాల్గో బౌల‌ర్‌గా ఉమేష్ యాద‌వ్ నిలిచాడు. ఈ జాబితాలో ఉమేష్ యాద‌వ్‌కు కంటే ముందు సందీప్ శ‌ర్మ (53), జ‌హీర్ ఖాన్ (52), భువ‌నేశ్వ‌ర్ కుమార్ (52) ఉన్నారు.

 తుది జ‌ట్లు:

తుది జ‌ట్లు:

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీప‌ర్), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Story first published: Saturday, April 22, 2023, 20:07 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+