
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్టుకు ఈ సారి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడని కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేష్ పలు విషయాలపై మాట్లాడాడు. ఈ సందర్భంగా మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తనను కోనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. వేలంలో తన పేరు వచ్చినప్పుడు మొదటి సారి ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదని, రెండో సారి కూడా ఇలాగే జరిగిందని అన్నాడు. కానీ మూడో సారి వచ్చినప్పుడు తనను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిందని గుర్తు చేసుకున్నాడు. తనపై నమ్మకంతో తనను కొనుగోలు చేసిన కోల్‌కతా మేనేజ్‌మెంట్‌కు ఉమేష్ యాదవ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. 2014 నుంచి 2017 వరకు తాను కేకేఆర్‌కే ఆడానని, ఆ సమయంలో మేనేజ్‌మెంట్‌తో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నాడు. ఇక తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
అయితే ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని చెప్పుకొచ్చిన ఉమేష్ యాదవ్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ సారి ట్రోఫీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ కప్ గెలిచిన జట్టులో ఉమేష్ యాదవ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇక మెగా వేలంలో ఉమేష్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 121 మ్యాచ్‌లాడిన ఉమేష్ యాదవ్ 119 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/24గా ఉన్నాయి. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నేటి నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతుంది. నేడు జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

కోల్‌కతా నైట్ రైడర్స పూర్తి జట్టు
ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, పాట్ కమిన్స్, నితీష్ రాణా, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, అజింక్యా రహానే, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, రసిఖ్ దర్, చమిక కరుణరత్నే, బాబా ఇంద్రజిత్, బాబా శర్మ, ప్రత్మ్ సింగ్ , అభిజీత్ తోమర్, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ హేల్స్, రమేష్ కుమార్, మహమ్మద్ నబీ, అమన్ ఖాన్, ఉమేష్ యాదవ్.