Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన ఫీల్డ‌ర్లు ఎవరో తెలుసా? టాప్ 10 లిస్ట్ ఇదిగో!

IPL 2022: Top 10 list of fielders with the most catches in the IPL History

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రో 3 రోజుల్లోనే అంటే ఈ శ‌నివారం నుంచే ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభంకానుంది. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన రికార్డుల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో ఎక్కువ క్యాచ్‌లు ప‌ట్టిన ఫీల్డ‌ర్ ఎవ‌ర‌ని వెతుకుతున్నారు.

ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో ఫీల్డింగ్ ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఫీల్డ‌ర్లు ప‌ట్టే క్యాచ్‌లే మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్దేశిస్తాయి. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన టాప్ 10 ఫీల్డ‌ర్ల లిస్ట్‌ను ఓ సారి గ‌మ‌నిద్దాం.

ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన ఫీల్డ‌ర్ల జాబితాలో సురేష్ రైనా మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఈ చెన్నైసూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు ఐపీఎల్‌లో 109 క్యాచ్‌లు ప‌ట్టాడు. ఇందుకుగాను రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడాడు. ముంబై ఇండియ‌న్స్ ఫీల్డ‌ర్ కీర‌న్ పొలార్డ్ 96 క్యాచ్‌ల‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో పొలార్డ్ ఇప్ప‌టివ‌ర‌కు 178 మ్యాచ్‌లు ఆడాడు. 90 క్యాచ్‌ల‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ ఫీల్డ‌ర్ ఏబీ డివిల్లియ‌ర్స్ మూడో స్థానంలో ఉన్నాడు.

డివిల్లియ‌ర్స్ ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడాడు. ఇవే 90 క్యాచ్‌ల‌తో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నాల్గో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 213 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 207 మ్యాచ్‌ల్లో 84 క్యాచ్‌లు అందుకున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫీల్డ‌ర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.

192 మ్యాచ్‌లాడిన శిఖ‌ర్ ధావ‌న్ 82 క్యాచ్‌ల‌తో ఆరో స్థానంలో, 200 మ్యాచ్‌లాడిన ర‌వీంద్ర జ‌డేజా 81 క్యాచ్‌ల‌తో ఏడో స్థానంలో ఉన్నాడు. 151 మ్యాచ్‌ల్లో 77 క్యాచ్‌లు ప‌ట్టిన డ్వేన్ బ్రావో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 154 మ్యాచ్‌లాడిన మ‌నీష్ పాండే 75 క్యాచ్‌ల‌తో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక ప‌దో స్థానంలో డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు. 150 మ్యాచ్‌లాడిన వార్న‌ర్ 68 క్యాచ్‌లు ప‌ట్టాడు.

Story first published: Wednesday, March 23, 2022, 16:58 [IST]
Other articles published on Mar 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+