For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Lucknow Team For IPL 2022: స్టార్ల‌తో టైటిల్ ఫెవ‌రేట్‌గా లక్నో సూప‌ర్ జెయింట్స్‌.. తుది జ‌ట్టు ఇదే!

IPL 2022: Three all-rounders in Lucknow Super Giants playing 11 for IPL 15
IPL 2022 : Lucknow Super Giants Team Analysis And Final Squad | Oneindia Telugu

ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. జ‌ట్ల‌న్నీ కోట్ల రూపాయ‌లు పోసి త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లోకి ఈ సారి కొత్తగా అడుగుపెట్టిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈ సారి మెగా వేలంలో 18 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అంత‌కుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆట‌గాళ్ల‌ను క‌లుపుకోని ఆ జ‌ట్టులోని స‌భ్యుల సంఖ్య 21కి చేరింది. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్ 15 సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో తుది జ‌ట్టు ఎలా ఉండ‌బోతుందోననే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది.

 ప‌టిష్ట‌మైన జ‌ట్టు కొనుగోలు

ప‌టిష్ట‌మైన జ‌ట్టు కొనుగోలు

మెగా వేలానికి ముందే కెప్టెన్ కేఎల్ రాహుల్, ర‌వి బిష్ణోయ్‌, స్టోయినీస్‌ను రిటైన్ చేసుకున‌న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వేలంలోనూ దూకుడు క‌న‌బ‌రిచి స్టార్ ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకుంది. స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌డంలో ల‌క్నో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అత్య‌ధికంగా యువ బౌల‌ర్ ఆవేశ్ ఖాన్‌ను ఆ జ‌ట్టు 10 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌ను 8 కోట్ల 75 లక్ష‌ల‌కు, టీమిండియా ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాను 8 కోట్ల 25 లక్ష‌ల‌కు ద‌క్కించుకుంది. ఇంగ్లండ్ ఆట‌గాడు మార్క్‌వుడ్‌ను 7 కోట్ల 50 ల‌క్ష‌ల‌కు, సౌతాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను 6 కోట్ల 75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. దీప‌క్ హుడాకు రూ.5.75 కోట్లు, మ‌నీష్ పాండేకు రూ. 4.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

 బ‌ల‌మైన ఆల్‌రౌండ‌ర్లు

బ‌ల‌మైన ఆల్‌రౌండ‌ర్లు

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు ఈ సారి అన్ని విభాగాల్లో బ‌లంగా కనిపిస్తుంది. ఆ జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైన‌ప్ బ‌లంగా ఉంది. ఇక ఆ జ‌ట్టులో ముగ్గురు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్లుగా అద‌ర‌గొడుతున్న మార్క‌స్ స్టోయినీస్, జేస‌న్ హోల్డ‌ర్‌, కృనాల్ పాండ్యా ఆ జట్టులో ఉన్నారు. దీంతో వీరి ముగ్గురికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని చెప్పుకోవాలి. మంచి స‌పోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంది. దీంతో ఆ జ‌ట్టు వ్యూహాలు అనుకున్న‌ట్లుగా వ‌ర్కౌట్ అయితే టైటిల్ గెల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఐపీఎల్ 2022లోకి ల‌క్నో టైటిల్ ఫెవ‌రేట్‌గా అడుగుపెట్ట‌నుంది.

 ల‌క్నో పూర్తి స్క్వాడ్‌

ల‌క్నో పూర్తి స్క్వాడ్‌

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మార్కస్ స్టొయినిస్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, మార్క్‌ వుడ్, క్వింటన్ డికాక్‌, దీపక్‌ హుడా, మనీశ్‌ పాండే, దుష్మాంత చమీరా, ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్, అంకిత్ సింగ్ రాజ్‌పుత్, షాబాజ్ నదీమ్ , కేల్‌ మయేర్స్‌, మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌.

తుది జ‌ట్టులో ఉండే ఆట‌గాళ్లు

తుది జ‌ట్టులో ఉండే ఆట‌గాళ్లు

ల‌క్నో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ ప్రారంభించ‌డం ఖాయ‌మ‌ని చెప్పుకోవాలి. మిడిలార్డ‌ర్‌లో మ‌నీష్ పాండే, విన్ లూయిస్, దీప‌క్ హుడా, షాబాజ్ నదీమ్, మ‌న‌న్ వోహ్రా బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆల్‌రౌండ‌ర్లు కృనాల్ పాండ్యా, మార్క‌స్ స్టోయినీస్‌, జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌నున్నారు. ఇక బౌల‌ర్ల జాబితాలో ఆవేష్ ఖాన్, దుష్మాంత చమీరా పేస్ బౌల‌ర్లుగా ఉండ‌నున్నారు. స్పిన్ కోటాలో ర‌వి బిష్ణోయ్ ఖాయం కాగా, అత‌నికి తోడుగా షాబాజ్ నదీమ్, క‌ర‌ణ్ శ‌ర్మ ఆడే అవ‌కాశం ఉంది.

ల‌క్నో తుది జ‌ట్టు

ల‌క్నో తుది జ‌ట్టు

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్‌), మ‌నీష్ పాండే, విన్ లూయిస్, దీప‌క్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క‌స్ స్టోయినీస్‌, జేస‌న్ హోల్డ‌ర్, ఆవేష్ ఖాన్, ర‌వి బిష్ణోయ్, క‌ర‌ణ్ శ‌ర్మ.

Story first published: Wednesday, February 23, 2022, 13:10 [IST]
Other articles published on Feb 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+