
ముగ్గురిపై అందరి చూపు
ఈ సారి మెగా వేలంలో భారత ఆటగాళ్లైన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందుకు వారికి ఉన్న స్టార్ డమ్, టాలెంటే కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ముగ్గురు భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికే మ్యాచ్ విన్నర్లుగా పేరు కూడా తెచ్చుకున్నారు.
అనేక మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించారు. ఇక ఐపీఎల్‌లోనూ ఇప్పటికే తాము ఎంటో నిరూపించుకున్నారు. దీంతో వీరి కోసం ప్రాంచైజీలన్నీ మెగా వేలంలో పోటాపోటీగా తలపడనున్నాయి. దీంతో వీరిపై వేలంలో కోట్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రిటెన్షన్ జాబితాలో నో ప్లేస్
గతేడాది ఐపీఎల్‌లో ఆయా జట్లలో కీలక ఆటగాళ్లుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌కు ఆ జట్ల రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శ్రేయస్ అయ్యర్ తనకు తానుగానే వేలానికి వచ్చినట్టు సమాచారం. ఇక ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్ కిషన్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన శార్దూల్ ఠాకూర్‌కు ఆయా జట్ల రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు.
దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు వేలంలో అన్ని ఫ్రాంచైజీలకు హాట్ కేకుల్లా కనిపిస్తున్నారు.

వీరికి ఎందుకింత క్రేజ్
ఐపీఎల్ వేలంలో ఈ సారి శ్రేయస్, ఇషాన్, ఠాకూర్‌కు ఇంత క్రేజ్ ఉండడానికి వారికున్న రికార్డులు, స్టామినానే కారణంగా చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ విషయానిస్తో నిలకడైన బ్యాటర్‌గా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 123 స్ట్రైక్‌రేట్‌తో 31 సగటుతో 2375 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 96 పరుగులు. దీనికి తోడు మంచి కెప్టెన్‌గా కూడా పేరు ఉంది. దీంతో శ్రేయస్‌ను టీంలోకి తీసుకుంటే మంచి బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ ఉపయోగాపడతాడు.

కిషన్, ఠాకూర్ రికార్డులు
ఇక ఇషాన్ కిషన్ విషయానికొస్తే మంచి బ్యాటర్, వికెట్ కీపర్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో తానెంటో నిరూపించుకున్నారు. మంచి ఓపెనింగ్ బ్యాటర్‌గా కూడా పేరు ఉంది. మిడిలార్డర్‌లోనూ బ్యాటింగ్ చేయగలడు. ఇప్పటివరకు ముగిసిన ఐపీఎల్‌లో 136 స్ట్రైక్‌రేట్‌తో 28 సగటుతో 1452 పరుగులు చేశాడు. ఇక ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు బ్యాటర్‌గా, అటు బౌలర్‌గా రాణిస్తాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో తానెంటో నిరూపించుకున్నాడు. దీంతో శార్దూల్ జట్టులో ఉంటే మంచి ఆల్‌రౌండర్ టీంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో శార్దూల్ 67 వికెట్లు తీశాడు.

ఏఏ జట్లు పోటీ పడుతున్నాయి.. ధర ఎంత?
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించే సత్తా ఉన్న శ్రేయర్ అయ్యర్ ఈ ఐపీఎల్ మెగా వేలంలో 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయ్యర్ కోసం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. అయ్యర్ కోసం ఈ జట్లన్నీ 12 కోట్ల రూపాయలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.
అలాగే మంచి బ్యాటర్, వికెట్ కీపర్ అయినా ఇషాన్ కిషన్ కోసం కూడా పోటీ భారీగానే ఉంది. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్న కిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కిషన్‌కు ఈ జట్లు 12 కోట్ల రూపాయలకుపైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.

శార్దూల్ కోసం
ఇటీవల అద్బుత ఆటతీరుతో సత్తా చాటుతున్న ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కోసం మెగా వేలంలో తీవ్ర పోటీ నెలకోంది. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్న ఠాకూర్‌ను 12 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి కొనుగోలు చేయడానికి పలు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు వేలంలో భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ధర ఎంతని కచ్చితంగా తెలియాలంటే మెగా వేలం ముగిసే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications












