IPL retention policy: డెడ్‌లైన్ ఫిక్స్: మెగా వేలంపాట షెడ్యూల్: కొత్త ఫ్రాంఛైజీల మెలిక

ముంబై: వచ్చే ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా రెండు జట్లు ఫ్రాంఛైజీలు రావడంతో- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా రిటెన్షన్ పాలసీని అమల్లోకి తీసుకుని రానుంది. అలాగే- మెగా ఆక్షన్‌ను కూడా మళ్లీ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో షెడ్యూల్ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.

కొత్త రిటెన్షన్ పాలసీ అంటే..?
కొత్త రిటెయిన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిటెన్షన్ పాలసీ కోసం డిసెంబర్ 3వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ధారించింది. మెగా వేలంపాటను చేపట్టడానికి ముందే రిటైన్ చేసుకునే వెసలుబాటును కల్పించడం వల్ల ఈ రెండింటి మధ్య కనీసం నెల రోజుల వ్యవధిలో ఉండేలా ఏర్పాటు చేసింది.

జనవరిలో మెగా ఆక్షన్..
డిసెంబర్ 3వ తేదీలోగా ప్లేయర్ల రిటైన్ అంశం పూర్తయితే.. ఆ వచ్చేనెల అంటే కొత్త సంవత్సరం జనవరిలో మెగా వేలంపాటను బీసీసీఐ చేపడుతుంది. లక్నోకు చెందిన ఆర్పీ-సంజీవ్ గోయెంకా, అహ్మదాబాద్ నుంచి సీవీసీ కేపిటల్ పార్ట్‌నర్స్‌కు చెందిన జట్లు ఐపీఎల్ 2022లో ఆడనున్నాయి. డెడ్‌లైన్‌గా విధించిన డిసెంబర్ 3వ తేదీలోగా ప్లేయర్ రిటెన్షన్ కింద ముగ్గురు చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ సూచించింది.

మెలిక పెట్టిన కొత్త ఫ్రాంఛైజీలు..
ప్లేయర్ల రిటెన్షన్ విషయంలో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు మెలిక పెట్టాయి. పాత ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ ఈ రెండు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు స్పోర్ట్‌స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.
బీసీసీఐ ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తే.. ఐపీఎల్ మెగా వేలం ఆసక్తిగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ఎనిమిది పాత ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్‌ను ఫైనలైజ్ చేసిన తరువాత కూడా ప్లేయర్లు కొత్త జట్లల్లోకి ఎంపిక చేసే అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. తమకు దక్కే రెమ్యునరేషన్ అధికంగా ఉంటే- రిటైన్ తరువాత ఆక్షన్‌లో పాల్గొనడానికి వీలు ఉంటుంది.

95 కోట్లకు..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు కేటాయించే అమౌంట్‌ను కూడా పెంచేలా బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 85 కోట్ల రూపాయల వరకు ఉంటోందీ అమౌంట్. దీన్ని 95 కోట్ల రూపాయలకు పెంచవచ్చని తెలుస్తోంది. రిటెన్షన్ పాలసీ, దానికి విధించిన డెడ్‌లైన్, ప్లేయర్ల ఫీజు, రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లకు చెల్లించే అమౌంట్, మెగా ఆక్షన్ నిర్వహించే తేదీ.. వాటన్నింటితో కూడిన పూర్తి వివరాలపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. వచ్చే వారం దీన్ని ఫైనలైజ్ చేస్తుంది. ఆ వెంటనే వాటిని ముసాయిదాను అన్ని ఫ్రాంఛైజీలకు పంపిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications