Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Lalit Modi biopic: బాలకృష్ణ నిర్మాత సాహసం: ఐపీఎల్ పితామహుడి జీవితంపై సినిమా: టైటిల్ ఫిక్స్

IPL 2022: Thalaivi and 83 movie makers announce biopic on IPL founder Lalit Modi

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన మెగా ఈవెంట్. 2008లో ఆరంభమైన ఐపీఎల్ సీజన్.. అప్రతిహతంగా సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లోనూ దీనికి బ్రేక్ పడలేదు. ప్రతి సంవత్సరం ఇది ఏర్పాటవుతూనే వస్తోంది. మట్టిలో మాణిక్యాల్లాంటి క్రికెటర్లను వెలికి తీసిందీ టోర్నమెంట్. మెరికల్లాంటి ప్లేయర్లను దేశానికి అందించింది. టీమిండియా- ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయి ఎదగడానికి దోహదం చేసింది. క్రికెటర్ల మీద కనక వర్షాన్ని కురిపించే సింగిల్ టోర్నీ ఇదే.

లలిత్ మోడీ బ్రెయిన్ ఛైల్డ్..

లలిత్ మోడీ బ్రెయిన్ ఛైల్డ్..

ఐపీఎల్.. లలిత్ మోడీ బ్రెయిన్ ఛైల్డ్. దీనికి వ్యవస్థాపకుడు ఆయనే. ఈ సీజన్‌కు మొట్టమొదటి ఛైర్మన్, కమిషనర్‌గా వ్యవహరించారు. రెండు సంవత్సరాల పాటు హవా నడిపించారు. ఇప్పుడు ఆయన జీవితంపై బయోపిక్ రానుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన మావెరిక్ కమిషనర్: ది ఐపీఎల్-లలిత మోడీ సాగా అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కనుంది. ది ఐపీఎల్-లలిత మోడీ సాగా అనే టైటిల్‌ను ఈ బయోపిక్‌కు ఖాయం చేశారు.

నిర్మాత మరెవరో కాదు..

నిర్మాత మరెవరో కాదు..

ఈ సినిమా నిర్మాత మరెవరో కాదు.. విష్ణువర్ధన్ ఇందూరి. ఇదివరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత కథలను తెరకెక్కించారు. ఎన్టీఆర్: కథానాయకుడు, ఎన్టీఆర్: మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌ను పోషించిన ఈ రెండు సినిమాలు 2019లో విడుదలయ్యాయి. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తలైవి.. 83లకూ..

తలైవి.. 83లకూ..

అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితం మీద తెరకెక్కిన తలైవీ, బాలీవుడ్ హిట్ మూవీ, 1983 ప్రపంచకప్ మీద చిత్రికరించిన స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాలకు ఆయనే నిర్మాత. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తలైవీ టైటిల్ రోల్‌ను పోషించారు. 83 మూవీలో రణ్‌వీర్ సింగ్.. కపిల్ దేవ్ క్యారెక్టర్‌లో మెరుపులు మెరిపించారు. ఆ సినిమాల నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి ఇప్పుడు తాజాగా లలిత్ మోడీపై బయోపిక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. లలిత్ మోడీ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారు?, దర్శకుడెవరు? ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఐపీఎల్‌కు 15 సంవత్సరాలు..

ఐపీఎల్‌కు 15 సంవత్సరాలు..

ఐపీఎల్ ఆరంభమైన ఇవ్వాళ్టికి సరిగ్గా 15 సంవత్సరాలయింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ 2008లో ఇదే రోజు జరిగింది. కోల్‌కత నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అప్పటి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కల్లోలాన్ని రేపిన విషయం గుర్తుండే ఉంటుంది. 73 బంతుల్లో 158 పరుగులు చేశాడీ మాజీ న్యూజిలాండ్ ప్లేయర్. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బెంగళూరు దాన్ని ఛేదించలేక 82 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Monday, April 18, 2022, 15:11 [IST]
Other articles published on Apr 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+