
విండీస్‌తో సిరీస్‌లో గాయం
31 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు. అతని బొటన వేలుకి గాయమైంది. దీంతో అతను ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడబోయే ఆరంభ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌ల నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం.

వేలానికి ముందే రిటైన్
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేత ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందే రిటైన్ చేసుకుంది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లను పక్కనపెట్టి మరి ఆ జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను రిటైన్ చేసుకోవడం గమనార్హం. మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్ పూర్తి స్క్వాడ్
రోహిత్ శర్మ (16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (12 కోట్లు), కీరన్ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (8 కోట్లు), ఇషాన్ కిషన్ (15.25 కోట్లు), టిమ్ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్ (ఓవర్సీస్-3 కోట్లు), డేనియల్ సామ్స్ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్ వర్మ(1.70 కోట్లు), మురుగన్ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్ మిల్స్ (ఓవర్సీస్-1.50 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్ మార్కండే ( 65 లక్షలు), సంజయ్ యాదవ్ (50 లక్షలు), బసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ తెందూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్ ( వీరందరికీ 20 లక్షలు)


Click it and Unblock the Notifications












