IPL 2022: గుడ్ న్యూస్.. ఐపీఎల్‌లోకి సురేష్ రైనా రీఎంట్రీ

రానున్న ఐపీఎల్ సీజన్‌లో సురేష్ రైనా కనిపించడని బాధపడుతున్న అభిమానులకు ఒక శుభవార్త. రానున్న సీజన్లో సురేష్ రైనా కూడా కనిపించనున్నాడు. కాకపోతో ఆటగాడిగా కాకుండా కామెంటేటర్‌గా ఐపీఎల్ 2022లో సురేష్ రైనా సందడి చేయబోతున్నాడు. సురేష్ రైనా మాత్రమే కాదు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా రానున్న ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా కనపించనున్నాడు.

కామెంటేటర్‌గా సురేష్ రైనా
సురేష్ రైనా, రవి శాస్త్రి ఈ సారి ఐపీఎల్ హిందీ కామెంటేటరీలో భాగం కానున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉన్న సురేష్ రైనా కామెంటేటర్‌గా చేస్తే బాగుంటుందని భావించి, అతని ఆ విభాగంలో చేర్చినట్లు చెప్పింది. కాగా ఐపీఎల్‌లో సురేష్ రైనాకు మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న సంగతి తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌లో మంచి రికార్డులున్న సురేష్ రైనాను మెగా వేలంలో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు.

హిందీ కామెంటేటర్‌గా రవిశాస్త్రి
గతంలో ఇంగ్లీష్ కామెంట్రీ చేసిన రవిశాస్త్రి ఈ సారి హిందీ కామెంట్రీ చేయబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ హిందీ కామెంట్రీ కోసం శాస్త్రి శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఒక హిందీ భాషా నిపుణుడి ద్వారా జూమ్‌లో హిందీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. అలాగే కామెంటేటర్‌గా కొన్ని రిహార్సల్స్ కూడా చేస్తున్నాడు. గతంలో ఓ క్రీడా ఛానెల్ ఇంగ్లీష్ కామెంట్రీలో కీలక పాత్ర పోషించిన రవిశాస్త్రి టీమిండియాకు హెడ్ కోచ్ పదవి చేపట్టిన తర్వాత ఆ బాధ్యతలకు దూరంగా ఉన్నాడు. అయితే గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌తో రవిశాస్త్రి పదవి కాలం ముగియండంతో మళ్లీ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా మంచి విజయాలు సాధించింది. రవిశాస్త్రి చివరగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్‌గా పనిచేశాడు.

అమ్ముడుపోని రైనా
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ముందు వరుసలో ఉంటాడు. మంచి రికార్డులున్న రైనా మిస్టర్ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్నాడు. లీగ్‌లో ఆడినన్నీ రోజులు చెన్నైసూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు. సీఎస్కే లేని రెండు సంవత్సరాలు మాత్రం గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఆశ్చర్యకరంగా అలాంటి సురేష్ రైనాను ఈ సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ రైనాను కొనుగోలు చేయకుండా అందిరినీ ఆశ్చర్యపరించింది. ఇతర జట్లు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైనాకు తీవ్ర నిరాశ ఎదురైంది.

సురేష్ రైనా రికార్డులు
ఐపీఎల్‌లో 202 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 136గా ఉంది. ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో 506 ఫోర్లు, 203 సిక్సులు బాదాడు. పార్టు టైమ్ బౌలర్‌గానూ పర్వాలేదనిపించాడు. 25 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఎకానమీ 7.39 గా ఉంది. ఇక మంచి ఫీల్డర్‌గానూ రైనాకు పేరున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications