
సురేష్ రైనా టాప్
ఐపీఎల్‌లో ఎక్కువ సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 13 ఐపీఎల్ సీజన్లు ఆడిన రైనా ఏకంగా 9 సార్లు 400కు పైగా పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో 506 ఫోర్లు, 203 సిక్సులు బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

రెండో స్థానంలో కోహ్లీ, ధావన్
ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు. వీరిద్దరు ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎనిమిదేసి సీజన్లలో 400కు పైగా పరుగులు చేశారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 192 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 34 సగటుతో 5783 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 106 పరుగులుగా ఉంది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 207 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 37 సగటుతో 6283 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 113 పరుగులుగా ఉంది.

రోహిత్, వార్నర్ ఎన్నంటే
ఇక ఆ తర్వాత మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరు ఇప్పటివరకు ఏడేసి సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 213 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 31 సగటుతో 5611 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 109 పరుగులుగా ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 41 సగటుతో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 126 పరుగులుగా ఉంది.

26 నుంచి లీగ్
ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం జట్లన్నీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేశాయి. మే 29 వరకు జరగనున్న ఈ లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో లీగ్ స్టేజ్‌లోనే 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరగనుండగా.. ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












