
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు యాజమాన్యం తన ట్విట్టర్ హ్యాండిల్లో మదర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. సన్ రైజర్స్ ఆటగాళ్లు తమ తల్లులపై తమకున్న ప్రేమను ఈ వీడియోలో తెలియజేశారు. తమ పిల్లలు ఐపీఎల్ లాంటి క్రికెట్ వేదికపై ఆడడానికి ప్లేయర్ల తల్లులు తమ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు.
మదర్స్ డే సందర్భంగా క్రికెటర్లు వారి తల్లుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మంచి సందర్భం. ఐపీఎల్ నిబంధనల వల్ల బయోబబుల్‌లో ఉంటున్న క్రికెటర్లు చాలామంది తమ తల్లులను నేరుగా కలుసుకోలేరు. దీంతో ఓ వీడియో ద్వారా సన్ రైజర్స్ తల్లులకు తమ ప్రేమను వెల్లడించారు.
ఈ వీడియోలో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ తల్లులందరికీ ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమ తల్లులను గుర్తుచేసుకున్నారు. ఇది ఖచ్చితంగా తమ పిల్లలపై ప్రేమను కురిపించే తల్లులందరినీ ఆరాధించాల్సిన క్షణమని ప్లేయర్లు పేర్కొన్నారు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ గత మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన టి.నజరాన్ గాయపడడం, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ పది మ్యాచ్‌లలో కేవలం 199పరుగులు మాత్రమే చేశాడు. అలాగే అతని స్ట్రైక్ రేటు కూడా 100కంటే తక్కువ ఉండడం నిరాశపర్చుతుంది. అతను తన ఫామ్ అందుకుని దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరముంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 10గేమ్‌లలో 5విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడానికి ఓ విజయం కోసం సన్ రైజర్స్ ప్లేయర్లు తహతహలాడుతున్నారు. గత మ్యాచ్ కు దూరమైన నటరాజన్, మార్కో జాన్సేన్ స్థానంలో కార్తీక్ త్యాగి, సీన్ అబాట్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక తన తదుపరి మ్యాచ్ కు నటరాజన్, జాన్సేన్ తిరిగి జట్టులో చేరే అవకాశముంది. ఇక ఆరెంజ్ ఆర్మీ తమ తదుపరి మ్యాచ్ మే 8న వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్లేఆఫ్‌లకు రేసులో ఉన్న రెండు జట్లకు ఇది కీలకమైన ఎన్‌కౌంటర్ అని చెప్పవచ్చు.