For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: స‌న్‌రైజ‌ర్స్‌లోకి ముగ్గురు వెస్టిండీస్ స్టార్ ఆట‌గాళ్లు! ధ‌ర ఎంతంటే..

IPL 2022: Sunrisers Hyderabad will buy West Indies players Nicholas Pooran, Jason Holder and Alzarri Joseph in a mega auction.
IPL 2022 Mega Auction: Sunrisers Hyderabad Probable Squad, SRH పూర్తి జట్టు అంచనా | Oneindia Telugu

బెంగ‌ళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఇంకా ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆట‌గాళ్ల విష‌య‌మై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ అంచ‌నాకు వ‌చ్చింది. వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆట‌గాళ్ల కోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మైంది. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన వార్తల ప్రకారం మెగా వేలంలో ముగ్గురు వెస్టిండీస్ స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మెనేజ్‌మెంట్ నిర్ణ‌యించింద‌ట‌.

 స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ రిటెన్ష‌న్ జాబితా

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ రిటెన్ష‌న్ జాబితా

ఐపీఎల్ మెగా వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. స‌న్‌రైజ‌ర్స్ రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్, అబ్దుల్ స‌మ‌ద్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఇందులో అత్య‌ధికంగా కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు 14 కోట్ల రూపాయ‌లు చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. ఇక అబ్దుల్ స‌మ‌ద్, ఉమ్రాన్ మాలిక్‌కు 4 కోట్ల రూపాయ‌ల చొప్పున నిర్ణ‌యించ‌డానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మెగా వేలానికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌గ్గ‌ర ఇంకా 68 కోట్ల రూపాయ‌లు మిగిలి ఉన్నాయి.

విండీస్ ఆట‌గాళ్ల‌పై క‌న్ను

విండీస్ ఆట‌గాళ్ల‌పై క‌న్ను

మెగా వేలంలో ముగ్గురు వెస్టిండీస్ స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ య‌జ‌మాన్యం నిర్ణ‌యించుకుంద‌ని స‌మాచారం. స‌న్‌రైజ‌ర్స్ య‌జ‌మాన్యం ఎంపిక చేసిన వెస్టిండీస్ ప్లేయ‌ర్ల లిస్టులో నికోల‌స్ పూర‌న్, జేస‌న్ హోల్డ‌ర్‌, అల్జారీ జోసెఫ్ ఉన్నారు. వీరి కోసం మెగా వేలంలో ఎంత ఖ‌ర్చుకైనా వెనుకాడ‌కూడ‌ద‌ని స‌న్‌రైజ‌ర్స్ నిర్ణయించుకుందట‌. దీనికి ప్ర‌స్తుతం ఈ ముగ్గురు స్టార్ ప్లేయ‌ర్లు ఉన్న ఫామ్, వారికున్న‌ క్రేజే కార‌ణంగా తెలుస్తోంది.

రికార్డులు

రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 33 మ్యాచ్‌లు ఆడిన నికోల‌స్ పూర‌న్ 22 స‌గ‌టుతో 606 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్యధిక స్కోర్ 77 ప‌రుగులు. ఈ క్ర‌మంలో 35 ఫోర్లు, 44 సిక్సులు బాదాడు. మిడిలార్డ‌ర్‌లో వేగంగా ప‌రుగులు రాబ‌ట్ట‌గ‌ల‌డు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 26 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ బ్యాట‌ర్‌గా 189 ప‌రుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 47 ప‌రుగులు. ఈ క్ర‌మంలో 11 ఫోర్లు, 11 సిక్సులు బాదాడు. ఇక బౌల‌ర్‌గా 35 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/52 గా ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన పేస్ బౌల‌ర్‌ అల్జారీ జోసెఫ్ 6 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 6/12 గా ఉన్నాయి.

ధ‌ర ఎంతంటే?

ధ‌ర ఎంతంటే?

మెగా వేలంలో 1.5 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్న నికోల‌స్ పూర‌న్‌కు 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వెచ్చించాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భావిస్తోందట‌. ఇక 1.5 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్న జేస‌న్ హోల్డ‌ర్‌ను కూడా 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయాల‌ని అనుకుంటుంద‌ని సమాచారం. కాగా హోల్డ‌ర్ గ‌త సీజ‌న్లో కూడా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కే ప్రాతినిధ్యం వ‌హించాడు. కానీ స‌న్‌రైజ‌ర్స్ రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. అయితే వేలంలో హోల్డ‌ర్‌ను మ‌ళ్లీ కొనుగోలు చేయాల‌ని రైజ‌ర్స్ నిర్ణ‌యించింద‌ట‌. ఇక 75 ల‌క్ష‌ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్న పేస్ బౌల‌ర్‌ అల్జారీ జోసెఫ్‌కు 6 కోట్ల రూపాయ‌లు వెచ్చించాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ య‌జమాన్యం నిర్ణ‌యించింద‌ని స‌మాచారం.

Story first published: Thursday, February 10, 2022, 16:28 [IST]
Other articles published on Feb 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+