పూరన్ సూపర్ సెంచరీ
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే వార్త అందింది. మెగా వేలంలో 10 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధర పెట్టి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తాజాగా 37 బంతుల్లోనే సెంచరీ చేసి పూరన్ విధ్వంసం సృష్టించాడు. పూరన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయంటేనే అతని విధ్వంసం ఏ రేంజులో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

టి10 బ్లాస్ట్‌లో పూరన్ విధ్వంసం
టి10 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా లెథర్‌బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ స్కార్చర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ టియోన్ వెబ్‌స్టర్ 54, ఎవార్ట్ నికోల్‌సన్ 42 పరుగులతో రాణించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెథర్‌బాక్ జెయింట్స్ పూరన్ విధ్వంసంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే.. 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 38 బంతుల్లోనే 101 పరుగులతో నికోలస్ పూరన్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ ఏకంగా 272 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం.

కావ్యపై ప్రశంసలు
ఐపీఎల్ 2022 మెగా వేలంలో నికోలస్ పూరన్‌ను భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పుడు అంతా ఆశ్యర్యపోయారు. ఆ సమయంలో పూరన్ ఫాంలో కూడా లేడు. దీనికి తోడు గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అంతగా రాణించకపోవడంతో ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. అలాంటి ఆటగాడిని అనవసరంగా భారీ ధరకు కొనుగోలు చేసిందని మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై విమర్శలు గుప్పించారు. కానీ వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన తర్వాతి నుంచి ఆడిన మ్యాచ్‌ల్లో పూరన్ అదరగొడుతున్నాడు. భారత్‌తో ఆడిన టీ20 సిరీస్‌లోనూ పూరన్ అద్భుతంగా ఆడాడు. తాజాగా టీ10 బ్లాస్ట్ లీగ్‌లోనూ చెలరేగుతున్నాడు. దీంతో కావ్య మారన్ సెలెక్షన్ తప్పు కాదని, ఆమె నిర్ణయమే కరెక్టని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2022
కేన్ విలిమ్సన్(రూ.14 కోట్లు) , అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుంధర్(రూ.8.75 కోట్లు), నికోలస్ పూరన్(రూ. 10.75 కోట్లు), నటరాజన్(రూ.4 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.2 కోట్లు), ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు), రాహుల్ త్రిపాఠి(8.50 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు), కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు), జగదీష సుచిత్(రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 75 లక్షలు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7,75 కోట్లు).


Click it and Unblock the Notifications
