హైదరాబాద్: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ విడుదలైంది. ఈ మేరకు తమ కొత్త జెర్సీని సన్‌రైజర్స్ టీం తన అధికారిక ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆరెంజ్ ఆర్మీ కోసం కొత్త జట్టును అందిస్తున్నామని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త జెర్సీ నారింజ, నలుపు రంగులతో ఉంది. జెర్సీపై ఎక్కువ నారింజ రంగే కనిపిస్తుంది. జెర్సీ కాలర్, మెడ, చేతులు ఉండే ప్రదేశంలో మాత్రమే నలుపు రంగు ఉంది. అంచులలో కూడా నలుపు రంగు కనిపిస్తుంది. ఇక మిగతా భాగం మొత్తం జెర్సీ నారింజ రంగులోనే ఉంది. జెర్సీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ లోగోను కూడా గమనించవచ్చు. ఇక ప్యాంట్ మొత్తం నారింజ రంగులోనే ఉంది. ఇక జెర్సీ రంగు గత సంవత్సరం కంటే నిండుగా కనిపించడం గమనార్హం. ఈ జెర్సీని చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. జెర్సీపై ప్రశంసంలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌గా ఈ సారి కూడా టామ్ మూడీనే వ్యవహరించనున్నాడు. అయితే మిగతా సపోర్టింగ్‌లో మాత్రంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా, వ్యూహాత్మక సలహాదారుడిగా వ్యవహరించనున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేస్ బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. భారత మాజీ బ్యాట్స్‌మెన్ హేమన్ బదానీ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
2016లో ట్రోఫీ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సారి ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. గతేడాది అయితే తీవ్ర నిరాశజనక ఆట తీరుతో పాయింట్ల టేబుల్లో చిట్ట చివరన నిలిచింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే గెలిచింది. దీంతో ఈ సారి టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కాగా ఈ సారి తమ రిటెన్షన్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురికి మాత్రమే చోటు కల్పించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు ఆన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను తమ రిటెన్షన్ జాబితాలో చేర్చింది. కాగా ఈ సారి కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది.
Presenting our new jersey.
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022
The #OrangeArmour for the #OrangeArmy 🧡#ReadyToRise #IPL pic.twitter.com/maWbAWA0pc