
ఐపీఎల్ 2022లో నేటి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తన వేటను మొదలుపెట్టనుంది. నేడు తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పుణే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాహుబలి గెటప్‌లో ఉండడం గమనార్హం.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వివరాలు తెలియచేస్తూ విలియమ్సన్ బాహుబలి గెటప్‌తో కూడిన ఈ ఫోటోలో మ్యాచ్ డే అని రాసి ఉంది. అలాగే రాత్రి 7:30 గంటలకు పూణే వేదికగా మ్యాచ్ ప్రారంభం కానున్నట్లు వివరాలు ఉన్నాయి. ఆరెంజ్ ఆర్మీ ఫైర్ అని రాసి సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇక నేటి మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ సిద్ధమైంది. ఇందుకోసం పూర్తి కసరత్తులు కూడా పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఇక అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్ రమ్, నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌పై భారం ఉండనుంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. మొత్తంగా గతేడాది సీజన్‌ను చిట్టచివరి స్థానంతో ముగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్ రమ్, నికోలస్ పూరన్(కీపర్), అబ్డుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్/రొమారియో షెఫర్డ్/ శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్