
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ సారి స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 150 సెకన్లు మాత్రమే ఉన్న ఈ సమయాన్ని 3 నిముషాలకు పెంచే అవకాశం ఉందని సమాచారం. అంటే గతంలో ఉన్న దాన్ని డబుల్ చేయనున్నారన్న మాట. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్ చర్చించిస్తుందని సమాచారం. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారట. అయితే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయం పెంచడం వల్ల ఇరు జట్లు మ్యాచ్‌లో ప్రస్తుతం తాము ఉన్న పరిస్థితి గురించి, అలాగే అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించుకుంటాయని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ఆ సమయంలో వాణిజ్య ప్రకటనలను కూడా ఎక్కువగా ప్రసారం చేసుకోవచ్చని అనుకుంటున్నారట. కాగా ఐపీఎల్‌లో మ్యాచ్ జరిగే సమయంలో ప్రతి ఇన్నింగ్స్‌లో అంపైర్లు రెండు సార్లు స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయాన్ని ఇస్తుంటారు.
ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో లీగ్ స్టేజ్‌లో 70 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. పది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ప్రతి జట్లు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. కాగా ఐపీఎల్ ఈ మ్యాచ్‌లన్నీ ఈ సారి కరోనా కారణంగా మహారాష్ట్రలోని 4 స్టేడియాలలోనే జరగనున్నాయి. అయితే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్ద? అనే విషయమై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ 25 శాతం ప్రేక్షకులన అనుమతించే ఆలోచన మాత్రం చేస్తుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాలన్నింటిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.