For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RR Dream 11: టాప్ పిక్స్ ఇవే: కేప్టెన్, వైస్ కేప్టెన్‌గా వారు మాత్రమే

IPL 2022: SRH vs RR Top Picks For Dream11 Prediction and Fantasy Cricket Tips are here

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సన్‌రైజర్స్ ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు అభిమానులు. కొన్ని సీజన్లుగా తన సామర్థ్యానికి తగినట్టుగా రాణించట్లేదీ జట్టు. గత సీజన్‌లోనూ అదే పరిస్థితి. ఇప్పుడు ఆ టీమ్ ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

రాజస్థాన్ రాయల్స్‌తో కంపేర్ చేసి చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ కాస్త బలంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, యజువేందర్ చాహల్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, రస్సీ డుస్సెన్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నీల్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, కుల్‌దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్.. ఈ జట్టులో ఉన్నారు. యంగ్ ప్లేయర్లతో మంచి బ్యాకప్‌ను సమకూర్చుకుంది రాయల్స్.

సన్‌రైజర్స్‌లో ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్డుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెఫర్డ్/ శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మలిక్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. రాయల్స్‌ తుదిజట్టులో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్‌నీల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ ఆడొచ్చు.

రెండింటి తుదిజట్లలో ఉన్న డ్రీమ్ 11 ప్లేయర్లను సెలెక్ట్ చేయాల్సి వస్తే- టాప్ లిస్ట్‌లో నికొలస్ పూరన్ ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్.. ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డ్‌ను సాధించాడు. 33 మ్యాచ్‌లల్లో 606 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ ఇప్పటి దాకా 63 మ్యాచ్‌లల్లో 1885 పరుగులు చేశాడు. దాదాపు అన్ని సీజన్లల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ సంజు శాంసన్ ఇప్పటికే 3,000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 121 మ్యాచ్‌లల్లో 3,068 పరుగులు చేశాడీ మలయాళీ.

జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్‌కు డ్రీమ్ 11లో చోటు కల్పించవచ్చు. మొత్తంగా డ్రీమ్ 11 టీమ్‌లో సంజు శాంసన్, జోస్ బట్లర్, కేన్ విలియమ్సన్, దేవ్‌దత్ పడిక్కల్, అబ్దుల్ సమద్, జిమ్మీ నీషమ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జెన్‌సెన్, ట్రెంట్ బౌల్ట్, యజువేందర్ చాహల్, ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవచ్చు. కేప్టెన్‌గా కేన్ విలియమ్సన్, వైస్ కేప్టెన్‌గా సంజు శాంసన్, వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్‌ ఫిక్స్.

Story first published: Tuesday, March 29, 2022, 10:12 [IST]
Other articles published on Mar 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+