
రాజస్థాన్ తరఫున వందో మ్యాచ్..
ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ సంజు శాంసన్ తన కేరీర్‌లో ఓ ల్యాండ్ మార్క్‌ను అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వందో మ్యాచ్‌ను ఈ సాయంత్రం ఆడబోతున్నాడతను. 2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ బ్యాటర్.. ఇప్పటి వరకు 121 మ్యాచ్‌లను ఆడాడు. నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లల్లో 484 పరుగులు చేశాడు. ఇందులోో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.

హయ్యెస్ట్ స్కోర్ అతినిదే..
2020, 2021 సీజన్లలో 40కి పైగా సగటు, 140కి పైగా స్ట్రైక్ రేట్‌ను సాధించిందిన అయిదు మంది ప్లేయర్లలో సంజు ఒకడు. సన్‌రైజర్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో టాప్‌లో ఉన్నాడు. ఆరెంజ్ ఆర్మీపై ఇప్పటి వరకు 615 పరుగులు చేశాడు.
ఈ స్థాయిలో రన్స్ చేసిన మరో బ్యాటర్ లేడు. సంజుతో పాటు ఈ రెండు జట్లల్లోని పలువురు ప్లేయర్ కొత్త మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రాహుల్ త్రిపాఠి ఇంకో రెండు సిక్సర్లు బాదేస్తే.. హాఫ్ సెంచరీ చేసినట్టవుతుంది.

2,000 పరుగుల ల్యాండ్ మార్క్‌కు దగ్గరగా
ఇప్పటి వరకు 48 సిక్సర్లు కొట్టాడు. దేవ్‌దత్ పడిక్కల్ 95 ఫోర్ల మీద ఉన్నాడు. ఇంకో అయిదు ఫోర్లు కొడితే సెంచరీని అందుకుంటాడు. జోస్ బట్లర్ కూడా ఐపీఎల్ కేరీర్‌లో కొత్త మైలురాయి సమీపంలో నిలిచాడు. 32 పరుగులు చేస్తే- ఐపీఎల్‌లో 2,000 మార్క్‌ను అందుకుంటాడు. అలాగే- 200 క్లబ్‌లో చేరడానికి నాలుగు సిక్సుల దూరంలో ఉన్నాడు. బౌలర్ శ్రేయాస్ గోపాల్ 48 వికెట్ల వద్ద నిలిచాడు. ఇంకో రెండింటిని తన ఖాతాలో వేసుకోగలిగితే- 50 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు.

హైదరాబాద్‌పై సెకెండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా
నాథన్ కౌల్టర్ నీల్‌ది కూడా అదే పరిస్థితి. అతను కూడా రెండు వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 145 వికెట్లు ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ వికెట్లను తీసుకుంటే 150 రౌండ్ ఫిగర్‌కు వచ్చేస్తాడు. యజువేందర్ చాహల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు అతను 17 వికెట్లు తీసుకున్నాడు. అతనిది రెండో స్థానం. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో- సన్‌రైజర్స్‌పై 21 వికెట్లను పడగొట్టాడు.


Click it and Unblock the Notifications
