బెస్ట్ ఆఫ్ లక్ కేన్ మామా: తొక్కుకుంటూ పోవాలె..ఎదురొచ్చినోన్ని ఏసుకుంటూ పోవాలె


ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022, 15వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే నాలుగు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ నిలిచాయి. ఇప్పటిదాకా గెలుపు రుచిని చూసింది- ఈ లిస్ట్‌లో మరో జట్టు చేరబోతోంది. ఆ అవకాశం ఏ జట్టుకు దక్కుతుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

సన్‌రైజర్స్ వర్సెస్ రాయల్స్
ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సన్‌రైజర్స్ ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు అభిమానులు. కొన్ని సీజన్లుగా తన సామర్థ్యానికి తగినట్టుగా రాణించట్లేదీ జట్టు. గత సీజన్‌లోనూ అదే పరిస్థితి.

నో స్టార్స్..
ఇదివరకట్లా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పెద్దగా స్టార్లు లేరు. అంతకుముందు డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో.. వంటి గెలుపు గుర్రాలు జట్టులో ఉండేవి. ఇప్పుడు ఆ ప్లేయర్లెవరూ లేరు. మెగా వేలంపాట సందర్భంగా వేర్వేరు ఫ్రాంఛైజీల్లో జాయిన్ అయ్యారు. సన్‌రైజర్స్ వద్ద ఉన్నవి పరిమిత బ్యాటింగ్ వనరులే. కేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, గ్లెన్ ఫిలిప్స్, రొమారియో షెప్పర్డ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్ వంటి బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు.

బ్యాటింగ్ భారం కేన్ మామ మీదే..
బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ భారాన్ని దాదాపుగా కేన్ విలియమ్సన్ ఒక్కడే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్క్‌రమ్, పూరన్, గ్లెన్ ఫిలిప్స్.. కేప్టెన్‌కు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మెరుపులు మెరిపించగల సత్తా పూరన్‌కు ఉన్నప్పటికీ.. నిలకడలేమి అతణ్ని వేధిస్తోంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం బ్యాటింగ్ విభాగంలో రాణించడానికి ఇదో మంచి అవకాశం. నాణ్యమైన బౌలర్‌గా ఎలాగూ గుర్తింపు ఉంది అతనికి.

పూర్వవైభవం వస్తుందా?
ఆరెంజ్ ఆర్మీలో బ్యాటింగ్ కంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఒకింత బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, టీ నటరాజన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ గోపాల్, జే సుచిత్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్వవైభవాన్ని ఎలా సంతరించుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

2016లో విన్నర్‌గా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ టైటిల్ విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టీమ్ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 69, శిఖర్ ధవన్ 28, యువరాజ్ సింగ్ 38, బెన్ కట్టింగ్ 39 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ చివరి వరకూ పోరాడింది గానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ స్కోరర్ క్రిస్ గేల్.

2018లో ఫైనలిస్ట్..
2018లో మళ్లీ ఫైనల్ వరకూ వెళ్లగలిగింది ఆరెంజ్ ఆర్మీ. ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది. 178 పరుగులు చేసినా.. దాన్ని కాపాడుకోలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ దుమ్ము రేపాడు. 57 బంతుల్లోనే 117 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షేన్ వాట్సన్ ధాటికి.. టైటిల్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ స్థాయిలో సన్‌రైజర్స్ పెర్‌ఫార్మెన్స్ ఉండట్లేదు. ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications