Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింత వేషాలు, విచిత్ర వేషధారణలో సన్‌రైజర్స్ ప్లేయర్స్: కావ్యా పాప లేకుండా కాస్టూమ్స్ పార్టీ

IPL 2022, SRH vs RCB: Sunrisers Hyderabad players celebrates costume party

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ జోష్‌లో ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో విజయాలను సాధించిన అనంతరం ప్లేయర్లు ఆనందోత్సాహాల మధ్య గడుపుతున్నారు. అదే స్వింగ్‌లో తన తదుపరి మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై బ్రబౌర్న్ స్టేడియం దీనికి వేదికగా మారింది. రాయల్స్ పైనా గెలిచి తన జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది కేన్ విలియమ్సన్ టీమ్.

ఈ జోష్ మధ్య సన్‌రైజర్స్ ప్లేయర్లు కాస్టూమ్స్ పార్టీని నిర్వహించారు. ఒక్కొక్కరు ఒక్కో వేషధారణలో కనిపించారు. క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌తో సందడి చేశారు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కరేబియన్ లుక్, హిప్పీ గెటప్‌లో హంగామా చేశాడు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ గిటార్ ప్లేయర్‌గా మెరుపులు మెరిపించాడు. మిగిలిన ప్లేయర్లందరూ ఆడి, పాడారు. సరదాగా స్టెప్పులేశారు. రాక్ మ్యూజిక్‌లో మునిగితేలారు.

హాలీవుడ్ నటుడు, ర్యాప్ సింగర్ ఈ కాస్టూమ్స్ పార్టీకి స్పెషల్ ఇన్వైటీలుగా హాజరయ్యారు. ఈ కాస్టూమ్స్‌ పార్టీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డేల్ స్టెయిన్, బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. డేల్ స్టెయిన్, బ్రియాన్ లారా రాక్ స్టార్ గెటప్‌‌లో కనిపంచారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేశారు. దీనికి ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ అటెండ్ కాలేదు గానీ- స్పెషల్ మెసేజీని పంపించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో నెగ్గింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌లల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ చేతుల్లో ఓడిపోయినప్పటికీ.. అద్భుతంగా పుంజుకొంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కత నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్‌పై విజయాలను సాధించింది. ఇక తన తదుపరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది.

Story first published: Friday, April 22, 2022, 15:25 [IST]
Other articles published on Apr 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+