Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ కాదురా.. సన్‌ఛేజర్స్: కేన్ మామకు అలా అదృష్టం కలిసొచ్చింది

IPL 2022, SRH vs RCB: Sunrisers becomes Sunchasers, here is Kanes magic

ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- తన ఏడో మ్యాచ్‌ను ఆడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో విజయదుందుభిని మోగించిన కేన్ విలియమ్సన్ టీమ్.. తన జైత్రయాత్ర కొనసాగించడంపై కన్నేసింది. తొలి రెండింట్లో ఓడినా.. అద్భుతంగా రిటర్న్ అయింది.

ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్‌తో కలుపుకొని ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలిచాడు. ఐపీఎల్‌లో ఇదో రికార్డు. వరుసగా ఏడు మ్యాచ్‌లల్లో టాస్ గెలవడం అంటే మాటలు కాదు. అన్ని మ్యాచ్‌లల్లోనూ ఛేజింగ్ ఎంచుకోవడమూ అలాంటిదే. సన్‌రైజర్స్.. సన్ ఛేజర్స్‌గా మారింది. టాస్‌ను గెలవడంలో డబుల్ హ్యాట్రిక్‌ను దాటేశాడు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలవడంతో ఆరంభమైన కేన్ విలియమ్సన్ జైత్రయాత్ర ఈ మ్యాచ్ వరకూ అప్రతిహతంగా సాగింది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పైనా టాస్ గెలిచాడు.

మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో టాస్ కేన్ విలియమ్సన్‌ను వరించింది. ఆ తరువాత కోల్‌కత నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లోనూ టాస్ విన్నర్‌గా నిలిచాడు కేన్ విలియమ్సన్. ఇప్పుడు తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లోనూ టాస్‌ను గెలిచేశాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడింది సన్‌రైజర్స్. ఆ తరువాత జట్టు ఆటతీరు గాడిన పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో విజయాన్ని సాధించింది. ఇప్పుడీ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

పంజాబ్ కింగ్స్‌పై విజయదుందుభిని మోగించిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ముందడుగు వేసింది. టాప్ 5లో చోటు సాధించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించితే మరింత పైకెగబాకుతుంది. కేన్ విలియమ్సన్ వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలవడం పట్ల ట్విట్టరెట్టీలు స్పందిస్తోన్నారు. మెమెస్‌తో ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను నింపేస్తున్నారు. టాస్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా గెలిపించే సత్తా కేన్ మామకు ఉందని చెబుతున్నారు.

Story first published: Saturday, April 23, 2022, 19:37 [IST]
Other articles published on Apr 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+