For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేన్ మామ ఉచ్చులో రాయల్ ఛాలెంజర్స్: అధ్వాన్న ఓటమికి కారణాలివే..

 IPL 2022, SRH vs RCB: 4 reasons for RCB lost the match against Sunrisers Hyderabad

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. రైజింగ్ అవుతోంది. ది బెస్ట్ అనిపించుకుంటోంది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో ఒకేసారి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో తన జైత్రయాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తోంది ఆరెంజ్ ఆర్మీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సాధించిన విజయంతో సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రతిభ పతాక స్థాయికి చేరినట్టయింది.

 68 పరుగులకే..

68 పరుగులకే..

బలమైన బ్యాటింగ్ ఆర్డర్ గల ఆర్సీబీని 68 పరుగులకే కట్టడం చేయడం ఓ అద్భుతం. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్‌.. హైదరబాద్ బౌలర్ల ధాటికి వణికిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం నిలువునా కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్ సుయాష్ ప్రభుదేశాయ్ చేసిన 15 పరుగులే టాప్ స్కోర్.. అంటే బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడ డకౌట్లతో పాటు ఆరు సింగిల్ డిజిట్స్ నమోదయ్యాయి. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ మొత్తం 68 పరుగులకే నేలకూలింది.

 మళ్లీ డకౌట్..

మళ్లీ డకౌట్..

వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ రకంగా అతను పెవిలియన్ దారి పట్టడం వరుసగా ఇది రెండోసారి. మార్కొ జెన్‌సెన్ సంధించిన బంతిని కవర్స్ దిశగా ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి కాస్తా స్లిప్స్‌లో ఉన్న ఎయిడెన్ మార్క్‌రమ్ చేతిలో వాలింది. విరాట్ కోహ్లీ కోసం సెకెండ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టడం కేప్టెన్ కేన్ విలియమ్సన్ మాస్టర్ ప్లాన్‌కు అద్దం పట్టింది. కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ అయిదు పరుగులే.

నిప్పులు చెరిగిన బౌలర్లు..

నిప్పులు చెరిగిన బౌలర్లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తమ విజృంభణను కొనసాగించారు. బ్యాటర్లపై నిప్పు కణికల్లాంటి బంతులను సంధించారు. మార్కొ జెన్‌సెన్, టీ నటరాజన్, జగదీశ సుచిత్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జెన్‌సెన్, నటరాజన్ మూడేసి చొప్పున వికెట్లు కూల్చారు. సుచిత్ రెండు, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. జెన్‌సెన్ మినహా మిగిలిన బౌలర్ల ఎకానమి నాలుగు లోపే.

కేన్ కేప్టెన్సీ..

కేన్ కేప్టెన్సీ..

ప్రారంభంలోనే వికెట్లను కోల్పోతూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్‌.. మళ్లీ లేవకుండా దెబ్బకొట్టడంలో కేన్ విలియమ్సన్ సక్సెస్ అయ్యాడు. ఆ ఒత్తిడిని కంటిన్యూ చేసేలా స్కెచ్ వేశాడు. ఎక్కడా తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. మ్యాచ్ సాగే కొద్దీ ఆ ప్రెజర్‌ను మరింత పెంచుతూ వచ్చాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ సైతం ఆ ఉచ్చులో పడ్డారు. ఈ సీజన్‌లో తొలిసారిగా డకౌట్ అయ్యాడు దినేష్ కార్తీక్. వస్తూనే రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్.. కేన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

Story first published: Sunday, April 24, 2022, 8:33 [IST]
Other articles published on Apr 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+