SRH vs PBKS Playing 11: సన్‌రైజర్స్ కేప్టెన్ అతనే: కేన్ మామ డుమ్మా కొట్టిన వేళ..ప్లేఆఫ్స్ ఆఫ్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశ ముగియబోతోంది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ చిట్టచివరిది. ఇక ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. ఎలిమినేటర్స్, క్వాలిఫయర్స్ కోసం పోరాటం మొదలవుతుంది. ఎల్లుండి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. తొలి ఎలిమినేటర్ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటాయి.

ప్లేఆఫ్స్ నుంచి వైదొలగిన వేళ..
లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ రెండు జట్లు కూడా తప్పుకొన్నాయి. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలనే తాపత్రయం రెండు జట్లల్లో కనిపిస్తోంది. తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడింది.

చేజేతులా..
ఫస్ట్ హాఫ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకున్న తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది సన్‌రైజర్స్. అయిదు మ్యాచ్‌లల్లో ఎలా విజయం సాధించిందో.. ఆ తరువాతి అయిదింట్లో అదే రేంజ్‌లో ఓడిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు కొనసాగించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో రెండో స్థానం వరకు ఎగబాకిన ఈ జట్టు.. ప్రస్తుతం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. మొత్తంగా 13 మ్యాచ్‌లల్లో ఏడింట ఓడింది. నామ్ కే వాస్తేగా జరిగే ఈ మ్యాచ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది రాత్రికి తేలిపోతుంది.

కేప్టెన్‌గా..
సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్.. జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతను ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో కేప్టెన్‌గా ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేదా వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్ నికొలస్ పూరన్‌లల్లో ఒకరికి తాత్కాలికంగా జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందించే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్‌దీ..
మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌ది కూడా ఇదే పరిస్థితి. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థిని జయించడం ద్వారా పరువును నిలబెట్టుకోవడం తప్ప దాని వల్ల ఒరిగేదేమీ ఉండదు. రెండు జట్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.

తుదిజట్లల్లో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ టీమ్‌లో- జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, భానుక రాజపక్స/బెన్నీ హోవెల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషిధవన్/ఇషాన్ పొరెల్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ఆడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications