For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI Playing 11: ఇన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తు..ఇదొక్కటే ఒక ఎత్తు: సన్‌రైజర్స్‌లో కీలక మార్పు

 IPL 2022, SRH vs MI Playing 11: Glenn Phillips likely to replace Shashank Singh

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో పరాజయాలను చవి చూసిన పరిస్థితుల మధ్య.. ప్లేఆఫ్స్‌పై పూర్తిగా ఆశలను వదిలేసుకున్న దశలో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది సన్‌రైజర్స్. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సి ఉంటుంది ఆరెంజ్ ఆర్మీకి.

నో ఛాయిస్..

నో ఛాయిస్..

వరుసగా మ్యాచ్‌లల్లో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మరింత కిందికి దిగజారింది. 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇవ్వాళ్టి ముంబైతో మ్యాచ్ సహా ఇంకొకటి ఆడాల్సి ఉంది సన్‌రైజర్స్‌కు. టోర్నమెంట్ లీగ్ దశ చిట్టచివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో గెలిచి.. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయినా ఫలితం దక్కదు. ముంబై ఇండియన్స్‌పై ఓడిపోయి.. పంజాబ్ కింగ్స్‌పై గెలిచినా ఉపయోగం లేదు. ఈ రెండింటినీ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే గానీ ప్లేఆఫ్స్‌కు చేరలేదు ఆరెంజ్ ఆర్మీ. మరో ఛాయిస్ లేదు.

మునిగినట్టే..

మునిగినట్టే..

ఫస్ట్ హాఫ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకున్న తరువాత ఏమైందో.. ఏమో గానీ- అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయి సన్‌రైజర్స్‌కు. అయిదు మ్యాచ్‌లల్లో ఎలా విజయం సాధించిందో.. ఆ తరువాతి అయిదింట్లో అదే రేంజ్‌లో ఓడిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు ప్రస్తుతం సన్‌రైజర్స్ క్యాంప్‌‌లో కనిపించట్లేదు. వరుసగా అయిదు ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇప్పటికే దెబ్బతిన్న టోర్నమెంట్ నుంచి వైదొలగిన ముంబై ఇండియన్స్‌‌ను ఓడించకపోతే- తానూ మునుగుతుంది.

ఒకట్రెండు మార్పులు..

ఒకట్రెండు మార్పులు..

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఒకట్రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది సన్‌రైజర్స్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే శశాంక్ సింగ్‌కు బదులుగా గ్లెన్ ఫిలిప్స్‌ను ఆడించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లే ఆడాడీ కివీస్ ప్లేయర్. 26 పరుగులు చేశాడు. ఒక వికెట్ పడగొట్టాడు. శశాంక్ సింగ్‌కు బదులుగా ఈ ఆల్ రౌండర్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది టీమ్. మార్కో జెన్‌సెన్ స్థానంలో కార్తీక్ త్యాగిని జట్టులో చోటు కల్పించవచ్చు.

కేన్‌పై విమర్శల దుమారం..

కేన్‌పై విమర్శల దుమారం..

కేన్ విలియమ్సన్ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయట్లేదు. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ, మరోసారి 48. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లే కావడం వల్ల కేన్ ఇక బ్యాటింగ్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పైనా తొమ్మిది పరుగులే చేశాడు. రాహుల్ త్రిపాఠీదీ దాదాపు అదే పరిస్థితి. నికొలస్ పూరన్ కోల్‌కతపై విఫలం అయ్యాడు. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ-43, ఎయిడెన్ మార్క్‌రమ్-32 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.

తనతో పాటు ముంచుతుందా?

తనతో పాటు ముంచుతుందా?

ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా పెద్ద తేడా ఉండదు. ఒరిగేదేమీ ఉండద. ఇప్పటికే ఈ జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగింది. సన్‌రైజర్స్‌పై గెలిస్తే- ఆ జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు జమ అవుతాయంతే. ఇప్పటికే మునిగిన రోహిత్ సేన సన్‌రైజర్స్‌ను కూడా ముంచుతుందా? లేదా అనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. ప్రస్తుతం తన ప్రత్యర్థి జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టే పనిలో ఉంది ముంబై టీమ్.

తుదిజట్లల్లో..

తుదిజట్లల్లో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కేప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్/గ్లెన్ ఫిలిప్స్, మార్కో జెన్‌సెన్/కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ టీమ్‌లో- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కేప్టెన్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రమణ్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, కుమార్ కార్తికేయ సింగ్ ఆడొచ్చు.

Story first published: Tuesday, May 17, 2022, 7:31 [IST]
Other articles published on May 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+