For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతులు కాలాక..: తప్పు తెలుసుకున్న కేన్: ఆ ప్రయోగం సక్సెస్: ముంబైపై విజయానికి 5 కారణాలు

 5 Reasons Why Sunrisers Risers wins the match against Mumbai Indians.

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌‌లో ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సెకెండ్ హాఫ్ బిగినింగ్‌లో మొదలైన ఈ పరాజయాల పరంపరకు చివరి దశలో తెర దించింది. ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది. ఈ నెల 22వ తేదీన పంజాబ్ కింగ్స్‌ను తలపడుతుంది. ఈ ఐపీఎల్ 2022 సీజన్‌ లీగ్ దశకు అదే చిట్ట చివరి మ్యాచ్. ఆ తరువాత ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి.

ఎట్టకేలకు ఓ గెలుపు..

ఎట్టకేలకు ఓ గెలుపు..

వరుసగా అయిదు మ్యాచ్‌లను ఓడిపోయిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసింది. వాంఖెడె స్టేడియంలో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. తన ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్యను 12కు పెంచుకోగలిగింది. ఇందులో నెగ్గినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ చేరడానికి ఉన్న అవకాశాలు తక్కువే. మెరుగైన నెట్ రన్‌రేట్, తనకు పోటీ వచ్చే జట్ల పరాజయాలు సన్‌రైజర్స్‌ను ఒడ్డునపడేయగలవు.

 భారీ స్కోర్..

భారీ స్కోర్..

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియం గర్గ్-42, టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి-76, నికొలస్ పూరన్-38 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో 190 పరుగులు చేయగలిగింది. ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో మళ్లీ గాడినపడ్డట్టే. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

లోయర్ ఆర్డర్‌లో కేన్..

లోయర్ ఆర్డర్‌లో కేన్..

ఈ సీజన్‌లో అత్యంత నాసిరకంగా ఆడుతున్నాడు కేప్టెన్ కేన్ విలియమ్సన్. ఓపెనర్‌గా వరుసగా విఫలమౌతున్నాడు. మొత్తానికి తాను చేస్తోన్న తప్పేమిటో తెలుసుకోగలిగాడు. కాస్త ఆలస్యంగానైనా దాన్ని సరిదిద్దుకున్నాడు. ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వలేదు. ఏకంగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఓపెనర్‌గా భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమౌతూ వచ్చిన కేన్ తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. జట్టు భారీ స్కోర్ చేయడానికి కారణమైంది.

ఓపెనర్‌గా ప్రియం గర్గ్..

ఓపెనర్‌గా ప్రియం గర్గ్..

తనకు బదులుగా ఓపెనర్‌గా ప్రియం గర్గ్‌ను బరిలోకి దించుతూ కేన్ విలియమ్సన్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ప్రియం గర్గ్ రెచ్చిపోయి ఆడాడు. తోటి ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠితో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 78 పరుగులు చేశాడు. 26 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 42 పరుగులు చేశాడు ప్రియం.

 త్రిపాఠి తీన్‌మార్..

త్రిపాఠి తీన్‌మార్..

ఫస్ట్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి విజృంభించాడు. 44 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్ నికొలస్ పూరన్ ఈ దూకుడును కొనసాగించాడు. మూడు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ తక్కువ స్కోర్‌కే అవుట్ కావడం వల్ల కొంత జోరు తగ్గింది గానీ.. అతను కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుని ఉంటే 200 ప్లస్ నమోదు చేసి ఉండేదే సన్‌రైజర్స్.

బౌలింగ్‌లో ఆందోళనకరంగానే..

బౌలింగ్‌లో ఆందోళనకరంగానే..

ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తన స్కోర్‌ను 190 వరకూ తీసుకెళ్లగలిగిందంటే అది బౌలర్ల వైఫల్యమే. తొలి వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 95 పరుగులు చేసింది ముంబై. ఈ సీజన్‌లో ఈ జట్టుకు ఇదే హయ్యెస్ట్ పార్ట్‌నర్‌షిప్. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ- తమ ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి బౌలింగ్ చేసినట్టుగా కనిపించింది. రోహిత్ శర్మ-48, ఇషాన్ కిషన్-43 పరుగులు చేశారు. ఆ తరువాత వికెట్లు వెంటవెంటనే పడ్డప్పటికీ మిడిలార్డర్‌లో టిమ్ డేవిడ్ భయపెట్టాడు. 18 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.

సకాలంలో రనౌట్స్

సకాలంలో రనౌట్స్

సకాలంలో టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్‌ను రనౌట్స్ రూపంలో పెవిలియన్ పంపించడంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగింది కేన్ సేన. చివరి ఓవర్‌లో 19 పరుగులు చేయాల్సిన దశలో ఫజల్ ఫారూఖీతో బౌలింగ్ చేయించడం సైతం టెన్షన్ పెట్టింది. ఈ ఓవర్‌లో రమణ్‌దీప్ సింగ్ పరుగులు పిండుకున్నాడు. వైడ్‌ బాల్‌తో ఈ ఓవర్‌ను ఫారూఖీ ఆరంభించగా- రమణ్‌దీప్ సింగ్ సిక్స్‌తో ముగించాడు. 15 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై.

Story first published: Wednesday, May 18, 2022, 8:14 [IST]
Other articles published on May 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+