పూరన్.. నో రన్: నిలకడ లేమికి నిలువెత్తు నిదర్శనం: 16 మ్యాచ్‌లల్లో రెండుసార్లే..!


ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపరకు తెర తీసింది. వరస ఓటములు మళ్లీ చుట్టుముట్టినట్టే కనిపిస్తోంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించలేక చతికిల పడుతోంది. విజయాలు సాధించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో ఘోరంగా విఫలమౌతోంది. ప్లానింగ్ ఉన్నా.. గ్రౌండ్‌లో దాన్ని పక్కగా ఎగ్జిక్యూట్ చేయలేక చేతులెత్తేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్స్‌లల్లో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది.

చూడ్డానికి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా..
నిజానికి- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కేప్టెన్ కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రొమారియో షెప్పర్డ్ ఉన్నా వారిని నిలకడ లేమి వెంటాడుతోంది. ఒక మ్యాచ్‌లో ఫర్వాలేదనిపిస్తే.. మరో మ్యాచ్‌లో విఫలమౌతున్నారు. క్రీజ్‌లో పాతుకుపోయి నిలకడగా రాణిస్తారనే గ్యారంటీ ఉండట్లేదు. భారీ స్కోర్ సాధిస్తారనే నమ్మకం అసలు కలిగించట్లేదు.

నిలకడ లేమికి కేరాఫ్..
నిలకడ లేమికి వెస్టిండీస్ బ్యాటర్ నికొలస్ పూరన్ నిలువెత్తు నిదర్శనంగా మారాడు. ఇదివరకు జట్టు తరఫున భారీ స్కోర్లను సాధించిన అతను ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చే సరికి ఫామ్‌ను కోల్పోయాడు. తొలి మ్యాచ్‌లో ఆడలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌పై రాణించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపూ సన్‌రైజర్స్ విజయం ఢోకా లేదనిపించింది. అంతలోనే అవుట్ అయ్యాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

16 ఇన్నింగ్స్‌లల్లో రెండుసార్లే 30కి పైగా..
నికొలస్ పూరన్ పేరు మీద ఓ అధ్వాన్నపు రికార్డ్ నమోదైంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో పూరన్ తన చివరి 16 ఇన్నింగ్స్‌లల్లో రెండుసార్లు మాత్రమే 30కి పైగా స్కోర్‌ను అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన 34 పరుగులతో ఈ మార్క్‌ను దాటడం రెండోసారి.
అతని నిలకడ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లక్నోపై మ్యాచ్‌తో ఓ రకంగా అతను తన బ్యాటింగ్ రిథమ్‌ను అందుకున్నాడనే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఈ సీజన్ మొత్తానికీ కొనసాగిస్తాడా? లేదా అనేది తేలాల్సి ఉంది.

భిన్నంగా దీపక్ హుడా..
దీపక్ హుడా పరిస్థితి దీనికి పూర్తిభిన్నం. సన్‌రైజర్స్‌పై ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. సోమవారం రాత్రి నాటి మ్యాచ్‌లో అతను చేసిన 51 పరుగులు సన్‌రైజర్స్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఆరెంజ్ ఆర్మీపై ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లల్లో హుడా విఫలం అయ్యాడు. 13, 13, 0, 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సారి మాత్రం విజృంభించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం టీ20 మ్యాచ్‌లల్లో 150 బౌండరీలను మార్క్‌ను కూడా అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications