For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేన్ మామ ఊరడింపు మాటలు: అలా చేసి ఉంటే ఛేజింగ్ రిజల్ట్ మరోలా ఉండేది

IPL 2022, SRH vs LSG: Captain Kane Williamson feels that his team did well, despite the loss

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆ జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం. టైటిల్‌పై ఏ మాత్రం ఆశల్లేకుండా బరిలోకి దిగిన ఈ టీమ్.. గట్టిపోటీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా బోణీ కొట్టనే లేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పరాభవం పొందింది. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన ఆడనుంది. ఓటముల్లో తనతో సమవుజ్జీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది.

ఆ ఇద్దరి భాగస్వామ్యమే..

ఆ ఇద్దరి భాగస్వామ్యమే..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేప్టెన్ కేఎల్ రాహుల్-68, దీపక్ హుడా-51 చివర్లో ఆయుష్ బదోని మినహా లక్నో బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్‌లో దీపక్ హుడా 33 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చేసిన 51 పరుగులు ఆ జట్టుకు ప్రధాన భాగస్వామ్యం. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెప్పర్డ్, టీ నటరాజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

 పోరాడితే పోయేదేమీ లేదు గానీ..

పోరాడితే పోయేదేమీ లేదు గానీ..

కాస్త గట్టిగా పోరాడితే ఛేదించదగ్గ స్కోరే అది. అయినా తడబడింది హైదరాబాద్. తన పరాజయాల పరంపరను కొనసాగించింది. 38 పరుగులకు ఓపెనర్లను కోల్పోయింది. కేప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. కేన్-16, అభిషేక్ శర్మ-13 పరుగులు చేశారు. ఎయిడెన్ మార్క్‌రమ్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. 12 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఉన్నంతలో రాహుల్ త్రిపాఠి-44, నికొలస్ పూరన్-34 పరుగులు చేసి.. ఫర్వాలేదనిపించుకున్నారు. ఆల్‌రౌండర్ గుర్తింపు పొందిన వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఫలితంగా 157 పరుగుల వద్దే నిలిచిపోయింది హైదరాబాద్ ప్రస్థానం.

ఓటమిపై స్పందించిన కేన్

ఓటమిపై స్పందించిన కేన్

మ్యాచ్ ముగిసిన అనంతరం కేన్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. కేఎల్ రాహుల్, దీపక్ హుడా భాగస్వామ్యాన్ని సకాలంలో విడదీయలేకపోయామని అంగీకరించాడు. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పార్ట్‌నర్‌షిప్ ఆ జట్టుకు మంచి స్కోర్‌ను అందించిందని వ్యాఖ్యానించాడు. కిందటి మ్యాచ్ కంటే ఇవ్వాళ తమ ప్రదర్శన మెరుగ్గా ఉందని, పవర్ ప్లేలో మూడు వికెట్లను పడగొట్టగలిగామని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లల్లో కూడా బౌలింగ్ ఫర్వాలేదనిపించిందని కేన్ విలియమ్సన్ చెప్పాడు.

పార్ట్‌నర్‌షిప్ లేదు..

పార్ట్‌నర్‌షిప్ లేదు..

బ్యాటింగ్‌లోనూ కొంత మెరుగుపడినప్పటికీ- అది సరిపోలేదని కేన్ స్పష్టం చేశాడు. కేఎల్ రాహుల్-దీపక్ హుడా భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో విఫలం అయ్యామని, తమ ఇన్నింగ్‌లో అలాంటి భారీ భాగస్వామ్యాలు లేకపోవడమే జట్టు ఓటమికి కారణమైందని అన్నాడు. చిన్న మార్జిన్‌లను భారీ స్కోర్లుగా మలచుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై దృష్టి పెడతామని చెప్పాడు. మరిన్ని సింగిల్స్, డబుల్స్ సాధించి ఉంటే- ఛేజింగ్ ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు. జట్టులో ఉన్న లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమౌతామని కేన్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, April 5, 2022, 7:22 [IST]
Other articles published on Apr 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+