SRH vs KKR Playing 11: ప్రధాన బౌలర్లు దూరమైన వేళ..సన్‌రైజర్స్ కీలక మ్యాచ్: జట్టు అంచనాలివే

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మధ్యాహ్నం 7:30 గంటలకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో పరాజయాల తరువాత- ఆడనున్న మ్యాచ్ కావడం వల్ల దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సి ఉంటుంది ఆరెంజ్ ఆర్మీకి.

బెటర్ పొజీషన్‌లో ఆ రెండు..

బెటర్ పొజీషన్‌లో ఆ రెండు..

నాలుగు మ్యాచ్‌లల్లో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మరింత కిందికి దిగజారింది. 10 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్‌పై ఘన విజయాన్ని సాధించిన అనంతరం పంజాబ్ కింగ్స్ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. 12 పాయింట్లతో సన్‌రైజర్స్‌కు అడ్డుగా నిలిచింది. ఢిల్లీ కేపిటల్స్ సైతం 12 పాయింట్లతో సన్‌రైజర్స్ కంటే బెటర్ పొజీషన్‌ల్ ఉంది. ఈ అడ్డంకిని అధిగమించాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మంచి రన్‌రేట్‌తో గెలుపొందితే ఈ రెండు హర్డిల్స్‌ను దాటుకుంటుంది.

ఫస్ట్ హాఫ్‌లో చిత్తు..

ఫస్ట్ హాఫ్‌లో చిత్తు..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- కోల్‌కత నైట్‌రైడర్స్ మధ్య పోరు రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన అయిదో మ్యాచ్‌లో ఈ జట్టును చిత్తు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్తుతం సన్‌రైజర్స్ క్యాంప్‌‌లో లేదు. వరుసగా నాలుగు ఓటములతో తరువాత ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇప్పటికే దెబ్బతిన్న పులిలా ఉన్న కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టాలంటే అసమాన పోరాట పటిమను ప్రదర్శించాల్సి ఉంటుంది.

వాషింగ్టన్ సుందర్ ఆడే ఛాన్స్..

వాషింగ్టన్ సుందర్ ఆడే ఛాన్స్..

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది. రెండోసారి గాయ పడటం వల్ల జట్టుకు దూరం అయ్యాడీ ఆల్‌రౌండర్. ప్రస్తుతం కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. సీన్ అబాట్ స్థానంలో సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్ కూడా గాయపడ్డాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానమే. ఈ స్థానాన్ని కార్తీక్ త్యాగి భర్తీ చేశాడు.

ముంచుతున్న బౌలర్లు..

ముంచుతున్న బౌలర్లు..

ఇవి తప్ప సన్‌రైజర్స్ తుదిజట్టులో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. బౌలర్లు మాత్రం విజృంభించాల్సి ఉంది. సెకెండ్ హాఫ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్.. భారీ స్కోర్ మ్యాచ్‌లు. గుజరాత్ టైటాన్స్‌పై 195 పరుగుల టార్గెట్ కూడా నిలవలేదు. అంత భారీ స్కోర్‌ను కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం అయ్యారు. అయిదు వికెట్ల నష్టానికే 199 పరుగులు చేసింది గుజరాత్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 190 ప్లస్ స్కోర్ చేశాయంటే- సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేన్ మామ ఏం చేస్తాడో..

కేన్ మామ ఏం చేస్తాడో..

కేన్ విలియమ్సన్ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయట్లేదు. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ, మరోసారి 48. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లే కావడం వల్ల కేన్ ఇక బ్యాటింగ్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ నిలకడ కోల్పోయాడు. ఎయిడెన్ మార్క్‌రమ్‌, రాహుల్ త్రిపాఠీదీ దాదాపు అదే పరిస్థితి. నికొలస్ పూరన్ ఒక్కడే బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు గానీ.. జట్టును గెలిపించలేకపోతున్నాడు. భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగీ, వాషింగ్టన్ సుందర్.. బౌలింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టాల్సి ఉంటుంది.

కోల్‌కత పరిస్థితీ దాదాపు ఇంతే..

కోల్‌కత పరిస్థితీ దాదాపు ఇంతే..

కోల్‌కత నైట్‌రైడర్స్‌కూ గెలుపు అవసరమే. ప్రస్తుతం ఈ జట్టు వద్ద కూడా 10 పాయింట్ల ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో నెగ్గింది. తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌ను పక్కన పెడితే.. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఉన్నది ఇంకొక్కటే. తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడాల్సి ఉంది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడితే- ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్నట్టే. ఈ రెండింటినీ గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉండొచ్చు.

తుదిజట్లల్లో..

తుదిజట్లల్లో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్/సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి ఆడే అవకాశం ఉంది. కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్‌లో- అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్/శివం మావి, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 14, 2022, 7:24 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X