Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌తో శ్రేయాస్ అయ్యర్ కేరీర్‌లో బిగ్గెస్ట్ ఎఛీవ్‌మెంట్

IPL 2022, SRH vs KKR: Shreyas Iyer will be playing his 100th IPL match tonight

ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఈ సాయంత్రం కీలక మ్యాచ్ ఆడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఈ గేమ్ లైఫ్ అండ్ డెత్ వంటిదే. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు విషమపరీక్షలాంటిదీ మ్యాచ్. గెలిస్తే- కాస్తో, కూస్తో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. లేదంటే మాత్రం- ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్రమించిన మూడో జట్టుగా ఆవిర్భవిస్తుంది.

ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ టోర్నమెంట్‌ను నిష్క్రమించనున్నాయి. ఈ రెండింటి సరసన నిలుస్తుంది కోల్‌కత నైట్‌రైడర్స్. గెలిస్తే- మిగిలిన మ్యాచ్‌లల్లో పాయింట్ల, మెరుగైన నెట్ రన్‌రేట్ కోసం పోరాడాల్సి ఉంటుంది. మొత్తానికి కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు చాలా చాలా తక్కువ. 9.4 శాతం మాత్రమే ఛాన్సులు ఉన్నాయి ఈ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని నైట్‌రైడర్స్ టీమ్‌కు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కాకపోతే కొంత బెటర్ పొజీషన్‌లో ఉంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీకి ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాల శాతం 28.1. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇదివరకే ఈ రేసు నుంచి తప్పుకోగా.. గుజరాత్ టైటాన్స్.. ఆల్‌రెడీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ విషయంలో అత్యధిక అవకాశాలు ఉన్న జట్లు లక్నో సూపర్ జెయింట్స్-97.6, రాజస్థాన్ రాయల్స్-92.2 శాతం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 77.3 శాతం మేర ఆ అవకాశం ఉంది.

కాగా- అటు జట్టుతో పాటు ఇటు కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు కూడా ఇవ్వాళ్టి మ్యాచ్ అత్యంత కీలకం. అతని కేరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిన పోయే గేమ్. దీనికి కారణం- ఇది అతని వందో మ్యాచ్ కావడమే. ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నమెంట్లన్నింట్లోనూ కలిపి 99 మ్యాచ్‌లు ఆడాడు శ్రేయాస్. ఈ 99 మ్యాచ్‌లల్లో 2,711 పరుగులు చేశాడు. 31.52 బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 124.59. సెంచరీ మార్క్‌ను అందుకోలేదు గానీ.. 18 హాఫ్ సెంచరీలు ఊదేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 336 పరుగులు చేశాడు.

Story first published: Saturday, May 14, 2022, 16:33 [IST]
Other articles published on May 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+