
గుజరాత్‌తో రెండోసారి..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- గుజరాత్ మధ్య పోరు రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన నాలుగో మ్యాచ్‌ను గుజరాత్‌తో ఆడింది కేన్ సేన. చిత్తుగా ఓడించింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. మరోసారి హార్దిక్ పాండ్యా, అతని జట్టును ఓటమి రుచి చూపించడానికి సన్నద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే- పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ.. మూడో స్థానంలో ఉంది.

వాషింగ్టన్ సుందర్ రెడీ..
ఇవ్వాళ్టి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది. గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడీ ఆల్‌రౌండర్. ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ అయ్యాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా ప్రాక్టీస్ చేశాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. గుజరాత్ టైటాన్స్‌పై జరిగే మ్యాచ్‌కు అతను ఆడే ఛాన్సులను కొట్టి పారేయడానికి వీలు లేదు. జగదీష సుచిత్ గాయ పడ్డాడంటూ వార్తలు వస్తోన్న వేళ.. అతని స్థానంలో సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైనట్టే.

పెద్దగా మార్పుల్లేనట్టే..
ఇదొక్కటి తప్ప సన్‌రైజర్స్ తుదిజట్టులో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. వరుసగా విజయాలను సాధిస్తూ వస్తోన్న నేపథ్యంలో జట్టులో ఈ విన్నింగ్ టీమ్‌తోనే గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. కేన్ విలియమ్సన్ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయకపోయినప్పటికీ.. కేప్టెన్‌గా జట్టునునడిపిస్తోన్నాడు. స్టన్నింగ్ క్యాచ్‌లను పడుతున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లను మార్చుతూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు.

ఫామ్‌లో బ్యాటర్లు..
అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి.. ఫామ్‌లో ఉన్నారు. ఒకరు కాకపోయిన మరొకరు క్రీజ్‌లో నిలదొక్కుకుని భారీ స్కోరును సాధిస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా ఉంటోంది. భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ప్రారంభం నుంచే వికెట్లను తీసుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా తోడైతే- అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలు మరింత బలోపేతమౌతాయి.

గుజరాత్ దూకుడు..
ఈ సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు ఆడిన ఏడింట్లో ఒక్క మ్యాచ్‌లోనే.. అదీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో మాత్రమే ఓడింది. దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. శుభ్‌మన్ గిల్.. గాడి తప్పాడు. మాథ్యూ వేడ్‌కు బదులుగా జట్టులో చోటు దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా నిలకడగా ఆడట్లేదు. రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, యష్ దయాళ్‌తో బౌలింగ్ బలంగా ఉంది.

తుదిజట్లల్లో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీష సుచిత్/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్‌లో- శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ దయాళ్ చోటు దక్కించుకోవచ్చు.


Click it and Unblock the Notifications












