
ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- తన ఆరో మ్యాచ్‌ను ఆడుతోంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్. పంజాబ్ జట్టు కేప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గాయం కారణంగా ఆడట్లేదు. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధవన్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు. మయాంక్ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. శిఖర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించాడు.
కాగా- ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో కలుపుకొని ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలిచాడు కేన్ మామ. టాస్‌ను గెలవడంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలవడంతో ఆరంభమైన అతని జైత్రయాత్ర ఈ మ్యాచ్ వరకూ అప్రతిహతంగా సాగింది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పైనా టాస్ గెలిచాడు. మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ కేన్ విలియమ్సన్ వైపే మొగ్గు చూపింది.

అనంతరం కోల్‌కత నైట్ రైడర్స్ మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లోనూ టాస్ విన్నర్‌గా నిలిచాడు కేన్ విలియమ్సన్. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడినప్పటికీ.. అనంతరం సన్‌రైజర్స్.. రైజింగ్ అయింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఘన విజయాన్ని సాధించింది. హ్యాట్రిక్ విక్టరీస్‌ను అందుకుంది. ఇప్పుడీ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
ఈ మ్యాచ్‌లోనూ విజయాన్ని సాధిస్తే టాప్ 5లోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి సన్‌రైజర్స్‌కు. ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది. కాగా- కేన్ విలియమ్సన్ వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో టాస్‌ను గెలవడం పట్ల ట్విట్టరెట్టీలు స్పందిస్తోన్నారు. మెమెస్‌తో ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను నింపేస్తున్నారు. కేన్ మామ నక్కతోకను తొక్కొచ్చాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. టాస్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా గెలిపించే సత్తా కేన్ మామకు ఉందని చెబుతున్నారు.