కేన్ మామ తోపు..దమ్ముంటే ఆపు: గుజరాత్ టైటాన్స్‌కు సన్‌రైజర్స్ ఓపెన్ ఛాలెంజ్: ఆ కిక్ అలాంటిది

ముంబై: ఈ ఐపీఎల్ 2022 సీజన్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసి వచ్చినంతగా మరే జట్టుకు అచ్చి రాలేదు. ఆరెంజ్ ఆర్మీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎదురొచ్చినోడిని తొక్కి పక్కన పడేస్తోంది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో సాధించిన విజయాలు సన్‌రైజర్స్‌కు మాంఛి కిక్ ఇచ్చాయి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందీ జట్టులో. అదే ఊపులో ఇవ్వాళ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 5:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

గుజరాత్‌ను మళ్లీ ఓడించేలా..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- గుజరాత్ మధ్య పోరు రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన నాలుగో మ్యాచ్‌ను గుజరాత్‌తో ఆడింది కేన్ సేన. చిత్తుగా ఓడించింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. మరోసారి హార్దిక్ పాండ్యా, అతని జట్టును ఓటమి రుచి చూపించడానికి సన్నద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే- పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ.. మూడో స్థానంలో ఉంది.
ఆరో మ్యాచ్ గెలవబోతున్నాం..
గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టబోతోన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపుపై ధీమాగా ఉంది. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ విజయం సాధించబోతోన్నామంటూ స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో డబుల్ హ్యాట్రిక్ విక్టరీస్‌లను సాధిస్తామని తేల్చి చెబుతోంది. తన గెలుపును అడ్డుకోగలరా? అంటూ గుజరాత్ టైటాన్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. ఛాలెంజ్ విసరడంతో ఆగపోలేదు. దీన్ని సాధించడానికి శ్రమిస్తోంది. నెట్స్‌లో కఠోర ప్రాక్టీస్ చేస్తోంది.

అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాం..
ఈ మ్యాచ్‌లో మంచి రన్‌రేట్‌తో గెలవగలిగితే- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అగ్రస్థానం దాసోహం అంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోందీ టీమ్. ఏడు మ్యాచ్‌ల్లో అయిదింట్లో విజయం సాధించి.. 10 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. సన్‌రైజర్స్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఆ రెండు జట్లు తలా డజను పాయింట్లను సాధించాయి. అగ్రస్థానానికి చేరుకోవాలంటే సన్‌రైజర్స్ తానూ 12 పాయింట్లతో పాటు మంచి నెట్ రన్‌రేట్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫామ్ చూస్తోంటే.. గెలుపు సాధ్యమే..
అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి.. ఫామ్‌లో ఉన్నారు. ఒకరు కాకపోయిన మరొకరు క్రీజ్‌లో నిలదొక్కుకుని భారీ స్కోరును సాధిస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా ఉంటోంది. భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ప్రారంభం నుంచే వికెట్లను తీసుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా తోడైతే- అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలు మరింత బలోపేతమౌతాయి. ఈ ఫామ్ చూస్తోంటే సన్‌రైజర్స్ డబుల్ హ్యాట్రిక్ విక్టరీస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications