For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs CSK Playing 11: కేన్ మామకు టఫ్ ఛాలెంజ్: ధోనీ కేప్టెన్సీలోని ఎల్లో ఆర్మీతో ఫైట్

 IPL 2022, SRH vs CSK Playing 11: here is the all details of Match 46
IPL 2022: CSK loses first 3 matches, Aakash Chopra calls it worst performance |Oneindia News

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మొన్నటిదాకా అప్రతిహతంగా కొనసాగిస్తూ వచ్చిన జైత్రయాత్రకు సడన్ బ్రేక్ పడిన నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇవ్వాళ కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. డబుల్ హ్యాట్రిక్ విక్టరీస్‌కు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసిన అనంతరం- మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉంది. చెన్నైని ఓడించడానికి కఠోరంగా శ్రమించింది.

బౌలింగ్‌కు పదును..

బౌలింగ్‌కు పదును..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బౌలింగ్ వనరులపై ప్రధానంగా దృష్టి సారించింది. పదును పెంచుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే అయిదు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు విఫలం అయ్యారు. ఇది సన్‌రైజర్స్‌లో ఆందోళనను నింపింది. ఉమ్రాన్‌కు తోడుగా మిగిలిన బౌలర్లు కూడా రాణించివుంటే ఫలితం మరోలా ఉండేది. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో అలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. నెట్స్‌లో బౌలర్లు శ్రమించారు.

 బ్యాటింగ్‌పైనా

బ్యాటింగ్‌పైనా

బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉంది. దీనికి తగినట్టుగానే సత్తా చాటుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ నిలకడగా రాణిస్తున్నారు. మార్క్‌రమ్ ఇప్పటికే నాలుగు అర్ధసెంచరీలు బాదేశాడు. మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకరు కాకపోయిన మరొకరు క్రీజ్‌లో నిలదొక్కుకుని భారీ స్కోరును సాధిస్తున్నారు. మిడిలార్డర్‌లో నికొలస్ పూరన్, శశాంక్ సింగ్, లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లను ఆడగలిగేవారే. వారు క్రీజ్‌లో కుదురుకుంటే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలరు.

విఫలమౌతున్న కేన్..

విఫలమౌతున్న కేన్..

కేప్టెన్ కేన్ విలియమ్సన్.. బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లల్లో 148 పరుగులు చేశాడు. ఒక్కసారే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 93.08 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్. 2015 తరువాత కేన్ విలియమ్సన్ లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇదే. ఈ మ్యాచ్‌లో అతను విజ‌ృంభించాలని ఆశించని అభిమాని ఉండడు. బ్యాటర్లు సత్తా చాటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతనూ ఓ చెయ్యి వేయాలని కోరుకుంటున్నారు.

ధోనీ కేప్టెన్సీలో..

ధోనీ కేప్టెన్సీలో..

కేన్ విలియమ్సన్ ముందు ఉన్న బిగ్ హర్డిల్.. మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీ. చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ క్యాప్ మారిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా తన సారధ్య బాధ్యతలను వదులుకున్నాడు. ధోనీ చేతుల్లో పెట్టాడు. వరుస పరాజయాల నేపథ్యంలో అతనీ నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ కేప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్‌తోనే. దీన్ని కేన్ విలియమ్సన్ ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

చెన్నై రెండోసారి..

చెన్నై రెండోసారి..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన మూడో మ్యాచ్‌ను చెన్నైతో ఆడింది కేన్ సేన. చిత్తుగా ఓడించింది. వరుసగా రెండు పరాజయాల తరువాత చెన్నై ఓడించి.. ట్రాక్ ఎక్కింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. మరోసారి ఎల్లో ఆర్మీకి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే- పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుంది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ.. నాలుగో స్థానంలో ఉంది.

గుజరాత్ దూకుడు..

గుజరాత్ దూకుడు..

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిదింట్లో గెలిచింది రెండు మ్యాచ్‌లే. తన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ప్లేఆఫ్స్ వరకు వెళ్లాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లల్లోనూ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ధోనీ సేన. సన్‌రైజర్స్‌పై గెలిచి- తన ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభిస్తుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

 బ్యాటింగ్ పరిస్థితి ఇదీ..

బ్యాటింగ్ పరిస్థితి ఇదీ..

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విఫలమౌతున్నాడు. రాబిన్ ఉతప్ప నిలకడగా ఆడట్లేదు. అంబటి రాయుడు ఫర్వాలేదనిపించుకుంటున్నాడు. శివం దుబే, ఎంఎస్ ధోనీ పరిస్థితీ అంతే. రవీంద్ర జడేజా చేసిన స్కోర్‌లో సింగిల్ డిజిట్సే అధికం. డ్వేన్ బ్రావో, మిఛెల్ శాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో రాణిస్తున్నారు. సన్‌రైజర్స్‌పై కలిసికట్టుగా ఆడాల్సి ఉంటుంది. గాయంతో బాధపడ్డ అంబటి రాయుడు కోలుకున్నందున తుదిజట్టులో ఉండొచ్చు.

 తుదిజట్లల్లో..

తుదిజట్లల్లో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ తుదిజట్టులో- రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివం దుబే, ఎంఎస్ ధోనీ (కేప్టెన్- వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిఛెల్ శాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి ఉండొచ్చు.

Story first published: Sunday, May 1, 2022, 7:31 [IST]
Other articles published on May 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+