
తొలిరోజు వేలం ముగిసేసమయానికి..
తొలి రోజు మెగా వేలంపాట ముగిసే సమయానికి కొత్తగా 10 మందిని జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ. రిటైన్ చేసుకున్న కేప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను కలుపుకొంటే 13 మంది జట్టులో ఉన్నారు ప్రస్తుతానికి. రెండో రోజు వేలంపాట సందర్భంగా ఇంకో 12 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. దీనికోసం 20 కోట్ల 15 లక్షల రూపాయలను వ్యయం చేయాల్సి ఉంది. అన్‌సోల్డ్ ప్లేయర్లతో పాటు రెండోరోజు అన్‌క్యాప్డ్ క్రికెటర్లు ఎక్కువ మంది వేలానికి వచ్చే అవకాశం ఉంది.

ఆ నలుగురు తప్పితే..
కేప్టెన్ కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికొలస్ పూరన్, ప్రియంగర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, సుచిత్, శ్రేయాస్ గోపాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, కార్తిక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.. ఇప్పటికి ఈ జట్టు కోసం ఎంపికయ్యారు. వీరిలో కేన్, రాహుల్ త్రిపాటి, పూరన్, వాషింగ్టన్ సుందర్ తప్పితే.. చెప్పుకోదగ్గ బ్యాటర్ ఒక్కరూ లేరు. పూరన్ ఆటతీరు ఎలాంటిదో మనకు తెలుసు. కుదురుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. లేదంటే లేదంతే.

వాషింగ్టన్ సుందర్ బౌలర్‌గానే..
వాషింగ్టన్ సుందర్ బౌలర్‌కు ఎక్కువ.. బ్యాటర్‌కు తక్కువ. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోవచ్చనేది అభిమానుల అంచనా. టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న భువనేశ్వర్ గానీ, టీ నటరాజన్ గానీ ప్యూర్లీ బౌలర్లు. టీ20ల్లో బ్యాటింగ్ చేసే సత్తా వారికి లేదు. బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉన్న వాళ్లు..కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి మాత్రమే. కఠిన పరిస్థితులను ఎదుర్కొని క్రీజ్‌లో పాతుకుని పోయే టాలెంట్ ఉంది వారికి.

రెండో రోజు కీలకమే అయినా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అకౌంట్‌లో ప్రస్తుతం 20 కోట్ల 15 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో కాస్త గట్టోళ్లనే తీసుకునే అవకాశం ఉంది గానీ.. ఇప్పుడలాంటి ప్లేయర్లు అతి కొద్ది మందే ఉన్నారు. మెరికల్లాంటి ఆటగాళ్లు దాదాపు తొలి రోజే హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. సురేష్ రైనా, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ వంటి అన్‌సోల్డ్ ప్లేయర్లు ఉన్నారు. వారిని జట్టులోకి తీసుకోవడానికీ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

తొలి పరాజయం..
వేలంపాట సందర్భంగా కావ్య మారన్ ఎలాంటి స్ట్రాటజీని అనుసరించట్లేదనేది ప్లేయర్ల ఎంపికలోనే తేలిపోయింది. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న డేవిడ్ వార్నర్‌ను వదులుకుంది కావ్య మారన్. అతని కోసం ప్రయత్నం కూడా చేయనట్టే కనిపించింది. 6 కోట్ల 25 లక్షలకు వార్నర్‌ను ఢిల్లీ కేపిటల్స్ సొంతం చేసుకుంది. ఆ మొత్తం కంటే ఇంకో 25 లక్షల రూపాయల రూపాయలను ఎక్కువ పోసి.. అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకోవడంతోనే తొలి పరాజయాన్ని అందుకున్నట్టయింది.


Click it and Unblock the Notifications












