For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్.. పరాజయాల్లో వరస్ట్ రికార్డ్: ఏ టీమ్ కూడా ఇంత అధ్వాన్నంగా లేదుగా

IPL 2022: SRH Lost 13 Matches In Last 16 Matches Worst Record By Any Team.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపరకు తెర తీసింది. వరస ఓటములతో కుదేల్ అవుతోంది. ప్రత్యర్థి జట్టు కొడుతున్న దెబ్బల నుంచి తేరుకోలేకపోతోంది. తాను భారీ లక్ష్యాలను నిర్దేశించలేక.. వాటిని ఛేదించలేక చతికిల పడుతోంది. సీజన్ మారినా.. కొత్త నీరు జట్టులో చేరినా తన వైఫల్యాల నుంచి బయటపడలేకపోతోంది. వాటికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇక ముందు గెలుస్తుందనే గ్యారంటీ కూడా అభిమానుల్లో ఉండట్లేదు.

తదుపరి మ్యాచ్‌లో చెన్నైతో ఎలా నెగ్గుకొస్తుందో

తదుపరి మ్యాచ్‌లో చెన్నైతో ఎలా నెగ్గుకొస్తుందో

అందుకే ట్రోల్స్ మీద ట్రోల్స్ వేస్తూ తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటోన్నారు. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించలేకపోయింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తన తదుపరి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ నెల 9వ తేదీన జరుగుతుందీ మ్యాచ్.

మైండ్ బ్లాక్ వరస్ట్ రికార్డ్స్

మైండ్ బ్లాక్ వరస్ట్ రికార్డ్స్

ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో దెబ్బతిన్న సింహంలా ఉంది చెన్నై సూపర్ కింగ్స్‌ పరిస్థితి. అలాంటి జట్టుకు ఎదురెళ్లడానికి రెడీ అవుతోంది సన్‌రైజర్స్. సింహం ముందు జింక పిల్లలా ఉండొచ్చు సన్‌రైజర్స్ పరిస్థితి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో ఓటమే అయినప్పటికీ.. మొత్తంగా చూసుకుంటే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. దిగ్భ్రాంతికరమైన ఓటములను సన్‌రైజర్స్ చవి చూసింది. ఆ రికార్డులను తిరగేస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

13 మ్యాచ్‌లల్లో..

13 మ్యాచ్‌లల్లో..

2021 ఐపీఎల్ సీజన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడిపోయింది. తాను ఆడిన చివరి 16 మ్యాచ్‌లల్లో గెలిచింది మాత్రం.. ముచ్చటగా మూడే. ఇంత వరస్ట్ రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తప్ప మరో జట్టుకు లేదు. 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా వరుస పరాజయాలను చవి చూసినప్పటికీ.. ఇంత అధ్వాన్నంగా లేదు. ఈ సీజన్‌లోనూ అదే దుస్థితిని కొని తెచ్చుకుంది. అభిమానుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తోంది.

ఇతర ప్లేయర్ల రికార్డులివే..

ఇతర ప్లేయర్ల రికార్డులివే..

కేఎల్ రాహుల్ తాజాగా సన్‌రైజర్స్‌పై చేసిన 68 పరుగులతో టీ20 ఫార్మట్‌లో 50వ అర్ధసెంచరీకి చేరువ అయ్యాడు. దీపక్ హుడా సన్‌రైజర్స్‌పై ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. అతను చేసిన 51 పరుగులు ఈ టీమ్‌పై హయ్యెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్. చివరి నాలుగు ఇన్నింగ్‌లల్లో అతను ఆరెంజ్ ఆర్మీపై విఫలం అయ్యాడు. 13, 13, 0, 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సారి మాత్రం విజృంభించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం టీ20 మ్యాచ్‌లల్లో 150 బౌండరీలను మార్క్‌ను కూడా అందుకున్నాడు.

అవేష్ ఖాన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్..

అవేష్ ఖాన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్..

అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బెస్ట్ ఫిగర్స్‌ను నమోదు చేసుకున్నాడు. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇదివరకు అతని బెస్ట్ బౌలింగ్ 3/13గా ఉండేది. దాన్ని 4/24గా సవరించుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్ టీ నటరాజన్ 2/26తో తన బౌలింగ్ గణాంకాలను సవరించుకున్నాడు. నికొలస్ పూరన్ పేరు మీద ఓ అధ్వాన్నపు రికార్డ్ నమోదైంది. 16 ఇన్నింగ్స్‌లల్లో అతను కేవలం రెండుసార్లు మాత్రమే 30కి పైగా స్కోర్‌ను అందుకున్నాడు.

Story first published: Tuesday, April 5, 2022, 10:00 [IST]
Other articles published on Apr 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+