
కలిసిరాని కాలం..
పూర్తి ప్రతికూల వాతావరణం మధ్య ఈ సీజన్ ఐపీఎల్ టోర్నమెంట్‌ను ఆరంభించింది ఆరెంజ్ ఆర్మీ. మున్ముందు ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎలా ఎదుర్కొంటోందనే విషయం అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు మొత్తంగా విఫలం అయ్యారు.
సీనియర్ భువనేశ్వర్ కుమార్, రొమారియో షెప్పర్డ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన భువి 29 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీసుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షెప్పర్డ్ ఒక వికెట్ పడగొట్టి 33 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మలిక్, టీ నటరాజన్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నా ధారాళంగా పరుగులు ఇచ్చారు.

బౌలర్‌గా విఫలం..
బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన వాషింగ్టన్ సుందర్.. బౌలర్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లల్లో 47 పరుగులు ధారదాత్తం చేశాడు. ఒక్క వికెట్‌ను కూడా తీసుకోలేకపోయాడు. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను వేసిన అభిషేక్ శర్మ.. సుందర్‌తో పోటీ పడినట్టు కనిపించాడు. అతనికి ఏ మాత్రం తగ్గకుండా ఆ ఒక్క ఓవర్‌లోనే 15 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లను పడగొట్టలేకపోయారీ ఇద్దరు.

బ్యాటింగ్‌లో మెరుపులు..
అయినప్పటికీ- వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్.. అందరినీ ఆకట్టుకుంది. అతని బౌలింగ్ వైఫల్యాన్ని మరిపించేలా చేసింది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆల్‌రౌండర్ సునామీ సృష్టించాడు. 14 బంతులను మాత్రమే ఎదుర్కొన్న అతను 40 పరుగులు చేశాడు. 285.71 స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటాడు. అతను చేసిన స్కోర్‌లో రెండు భారీ సిక్సులు, అయిదు ఫోర్లు ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ కంట్రీబ్యూషన్ వల్ల సన్‌రైజర్స్ 149 పరుగుల వరకూ వెళ్లగలిగింది. లేదంటే మరింత దారుణ పరాజయాన్ని చవి చూసి ఉండేదే. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో షిమ్రోన్ హెట్మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వాషింగ్టన్ సుందర్‌కు ప్రమోషన్..
టీ20 ఫార్మట్‌కు అనుగుణంగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడతను. అతని బ్యాటింగ్ శైలి హెడ్ కోచ్ టామ్ మూడీని కట్టి పడేసింది. ఆకాశానికెత్తేశాడు. మున్ముందు వాషింగ్టన్ సుందర్ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు ప్రమోట్ చేస్తామనీ పేర్కొన్నాడు. ఇకపై జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తాడనే విశ్వాసం తనకు కలిగిందని టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. అతని కష్టాన్ని గుర్తించామని, బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు జరుపుతామని అన్నాడు.

టీమిండియాకు ఎంపిక అవుతాడు..
మరో బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడని టామ్ మూడీ ప్రశంసించాడు. 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేయగలిగాడని చెప్పాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా మాలిక్ బౌలింగ్‌ను అద్భుతమని వ్యాఖ్యానించాడు. అంత వేగంతో నిలకడగా బంతులు వేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు. అతను తప్పనిసరిగా జాతీయ జట్టుకు ఎంపిక అవుతాడని, జట్టులో సుదీర్ఘకాలం పాటు కొనసాగే సామర్థ్యం ఉందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












