Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీకు చేత కావట్లేదు గానీ.. మా సలహాలు తీసుకోండి: కావ్య పాపకు ఫ్యాన్స్ సజెస్ట్ చేసిన పేర్లు ఇవే

IPL 2022: SRH Fans Request Kavya Maran To Bid For These Players In Auction

హైదరాబాద్: కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని సంపాదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. ఇప్పుడు అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. జట్టును పునర్వ్యవస్థీకరించడానికి లభించిన అద్భుత అవకాశాన్ని అనవసరంగా వదులుకుంది. టీమ్ మొత్తంలో ముగ్గురు, నలుగురు మినహా చెప్పుకోదగ్గ క్రికెటర్ ఒక్కడూ లేకపోవడం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. టీమ్ మొత్తాన్ని స్క్రాప్‌తో నింపేసిందంటూ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

కొత్త ప్లేయర్ల కోసం సజెషన్స్ తీసుకున్న ఫ్రాంఛైజీ..

కేప్టెన్ కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికొలస్ పూరన్, ప్రియంగర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, సుచిత్, శ్రేయాస్ గోపాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, కార్తిక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.. ఇప్పటికి ఈ జట్టు కోసం ఎంపికయ్యారు. మిగిలిన బెర్తులను భర్తీ చేయడానికి పేర్లను సూచించాంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీనికి అభిమానులు భారీగా స్పందించారు. మెరికల్లాంటి ప్లేయర్ల పేర్లను సూచించారు.

విదేశీ ప్లేయర్ల పేర్లే ఎక్కువ..

ఓపెనర్లుగా దక్షిణాఫ్రికా ఆటగాడు రస్సీ వ్యాండెర్ డూస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్, న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కోన్వే, అలెక్స్ హేల్స్, వెస్టిండీస్‌కు చెందిన ఎవిన్ లెవిస్, ఓడియన్ స్మిత్, ఆస్ట్రేలియన్లు క్రిస్ లీన్, బెన్ మెక్‌డెర్మట్, స్టీవ్ స్మిత్‌‌, ఆడమ్ జంపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సజెస్ట్ చేశారు. అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్న సురేష్ రైనాతో పాటు సౌరభ్ తివారీ, శివమ్ దుబేలను తీసుకోవచ్చని సూచించారు. వికెట్ కీపర్లుగా మాథ్యూ వేడ్, సామ్ బిల్లింగ్స్ వంటి ప్లేయర్లను తీసుకోవాలని చెప్పారు.

రెండో రోజు కీలకమే అయినా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అకౌంట్‌లో ప్రస్తుతం 20 కోట్ల 15 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో కాస్త గట్టోళ్లనే తీసుకునే అవకాశం ఉంది గానీ.. ఇప్పుడలాంటి ప్లేయర్లు అతి కొద్ది మందే ఉన్నారు. మెరికల్లాంటి ఆటగాళ్లు దాదాపు తొలి రోజే హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. సురేష్ రైనా, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ వంటి అన్‌సోల్డ్ ప్లేయర్లు ఉన్నారు. వారిని జట్టులోకి తీసుకోవడానికీ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఫ్యాన్స్‌ సజెషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుందా?

ఈ 12 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసే విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. తన అభిమానుల సలహాలు, సూచనలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తుందనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది. జట్టు ప్లేయర్ల ఎంపిక, కూర్పు.. ఫ్రాంఛైజీకి కూడా నచ్చనట్టే కనిపిస్తోంది. అందుకే- అభిమానుల నుంచి సలహాలను ఆహ్వానించింది. వారు సూచించిన విధంగా అన్‌సోల్డ్‌గా ఉన్న సురేష్ రైనా, మాథ్యూ వేడ్‌ను తీసుకోవచ్చు. వీరిద్దరూ ఐపీఎల్ స్పెషలిస్టులే.

Story first published: Sunday, February 13, 2022, 11:44 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+