|
కెప్టెన్‌గానూ వరస్ట్
విలియమ్సన్ ఈ సీజన్లో ఓపెనర్‌గా అత్యంత చెత్త ప్లేయర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. తొలుత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన సన్‌రైజర్స్ తర్వాత వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. దీంతో మంచి టోర్నమెంట్‌ను కలిగి ఉందనుకున్న సమయంలో మిగిలిన 7 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
తద్వారా ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఒకానొక దశలో పాయింట్ల పట్టికలో 2వస్థానంలో నిలిచిన సన్ రైజర్స్‌ను ఆ స్థాయిని మెయింటెన్ చేయించడంతో కెప్టెన్ గా కేన్ మామ చిత్తయ్యాడు.

కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌లోనూ పస లేదు
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే కీరన్ పొలార్డ్ ఎన్నో సార్లు ముంబైకి చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ ఈ సీజన్లో మాత్రం పొలార్డ్ పస లేని బ్యాటింగ్ కనబరిచాడు. అతను బంతులను ఎదుర్కోవడంతో చాలా పేలవమైన స్ట్రైక్ కలిగి ఉన్నాడు. పొలార్డ్ కూడా బ్యాట్‌తో ఈ సీజన్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.
తద్వారా ముంబై లోయర్ ఆర్డర్ బలహీనంగా మారింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో పొలార్డ్ కూడా ఒకడు. అతను 2022 ఐపీఎల్ సీజన్లో విలియమ్సన్ తర్వాత లీస్ట్ బ్యాటింగ్ ఇంపాక్ట్ (59.42) కలిగి ఉన్నాడు. అనంతరం టాప్ 5లో లీస్ట్ ఇంపాక్ట్ కలిగిన ప్లేయర్లలో భారత యువ ఆటగాళ్లు షారుక్ ఖాన్, అనుజ్ రావత్, లలిత్ యాదవ్ వరుసగా ఉన్నారు.

రస్సెల్ ధమాకా ప్లేయర్
ఇకపోతే హైయ్యెస్ట్ ఇంపాక్ట్ కలిగిన ప్లేయర్ గా ఆండ్రీ రస్సెల్ నిలిచాడు. అతని బ్యాటింగ్ ఇంపాక్ట్ 499.1గా ఉంది. ఇక ఆండ్రీ రసెల్ ప్రాతినిధ్యం వహించే కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ చేరుకోనప్పటికీ బంతితో, బ్యాట్‌తో రసెల్ మాత్రం తన పవర్ చూపించగలిగాడు.
అతని బ్యాటింగ్ ఇంపాక్ట్ పర్ బాల్ స్కోరు 2.59గా ఉంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఏడో అత్యధికం. టాప్ సెవెన్లో అతనికిది మూడో ఎంట్రీ కూడా. అతను 2015, 2019లో కూడా అత్యుత్తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇకపోతే 2022సీజన్లో రస్సెల్ 32 సిక్సర్లు, 18 ఫోర్లతో 174.47 స్ట్రైక్ రేట్‌తో 335పరుగులు చేశాడు. 9.9 ఎకానమీతో 17వికెట్లు కూడా తీశాడు.