Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వదేశానికి తిరుగుముఖం పట్టిన కేన్ మామ: ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే: ఏమైంది?

IPL 2022: SRH captain Kane Williamson back to New Zealand, here is the reason

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన లైఫ్ అండ్ డెత్ గేమ్‌లో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మంగళవారం రాత్రి వాంఖెడె స్టేడియంలో రోహిత్ సేనపై మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో పరాజయాలను చవి చూసిన పరిస్థితుల మధ్య.. ప్లేఆఫ్స్‌పై పూర్తిగా ఆశలను వదిలేసుకున్న దశలో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడం జట్టుకు ఊపిరి పోసింది. తన ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగింది.

 22న చివరి లీగ్..

22న చివరి లీగ్..

ఈ సీజన్ లీగ్ దశలో సన్‌రైజర్స్ ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. తన చిట్టచివరి లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నెల 22వ తేదీన ఈ మ్యాచ్ ఉంటుంది. లీగ్స్‌లో అదే చివరిది. దీని తరువాత ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది ఐపీఎల్ 2022. అర్హత సాధించిన జట్లు మహారాష్ట్రను వీడతాయి. కోల్‌కత, అహ్మదాబాద్‌లకు తరలి వెళ్తాయి. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్, ఫైనల్‌ను నిర్వహించనుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.

ప్లేఆఫ్స్ ఆశలు అంతంతంగా

ప్లేఆఫ్స్ ఆశలు అంతంతంగా

కాగా- సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఆశలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పై గెలవడం వల్ల తన పాయింట్ల సంఖ్యను 12కు పెంచుకోగలిగింది. పంజాబ్ కింగ్స్‌పైనా విజయం సాధించగలిగితే ఈ సంఖ్య 14కు చేరుకుంటుంది. అదే పాయింట్ల వద్ద కాంపిటీషన్ తీవ్రంగా ఉంటోంది. ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికే 14 పాయింట్లను సాధించాయి. ఇంకో మ్యాచ్‌ను ఆడనున్నాయి.

పంజాబ్‌పై గెలవడానికి

కోల్‌కత నైట్‌రైడర్స్ ఇవ్వాళ్టి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిస్తే- అది కూడా 14 పాయింట్లతో నిలుస్తుంది. ఇన్ని జట్ల మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లు సంధించి- ప్లేఆఫ్స్ రేసులో నిలవగలిగితే అది అద్భుతమే అవుతుంది. ప్రస్తుతం తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది సన్‌రైజర్స్. ఈ మ్యాచ్‌ను వీలైనంత భారీ రన్‌రేట్ గెలవడానికి వ్యూహాలను రూపొందించుకుంటోంది.

 చివరి మ్యాచ్‌కు గైర్హాజర్

చివరి మ్యాచ్‌కు గైర్హాజర్

ఈ పరిణామాల మధ్య సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్- స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఇవ్వాళే న్యూజిలాండ్ ఫ్లయిట్ ఎక్కనున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండట్లేదు. దీనికి కారణం- అతని భార్య ప్రసవించడమే. కేన్ విలియమ్సన్ భార్య సారా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. ఈ కారణంతో అతను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది. కేన్, అతని భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది.

Story first published: Wednesday, May 18, 2022, 12:20 [IST]
Other articles published on May 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+