For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RR: ఎవరిది పైచేయి: అలా చేస్తే సన్‌రైజర్స్ ఓ మెట్టు పైకెక్కినట్టే

IPL 2022: SRH and RR have faced with each other in a total of 15 matches in the tournament so far
SRH vs RR : Sunrisers Hyderabad Predicted Playing XI Against Rajasthan Royals | Oneindia Telugu

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది. తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు సన్‌రైజర్స్ అభిమానులు. కొన్ని సీజన్లుగా తన సామర్థ్యానికి తగినట్టుగా రాణించట్లేదీ జట్టు. గత సీజన్‌లోనూ అదే పరిస్థితి. ఇప్పుడెలా ఆడుతుందనేది టెన్షన్ పెడుతోంది.

రాజస్థాన్ రాయల్స్‌తో కంపేర్ చేసి చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ కాస్త బలంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, యజువేందర్ చాహల్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, రస్సీ డుస్సెన్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నీల్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, కుల్‌దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్.. ఈ జట్టులో ఉన్నారు. యంగ్ ప్లేయర్లతో మంచి బ్యాకప్‌ను సమకూర్చుకుంది రాయల్స్.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తంగా 15 సార్లు తలపడ్డాయి. పైచేయి మాత్రం ప్రస్తుతానికి సన్‌రైజర్స్‌దే. మొత్తంగా ఎనిమిది సార్లు ఆరెంజ్ ఆర్మీ.. పింక్ టీమ్‌పై విక్టరీని నమోదు చేసింది. ఏడు మ్యాచ్‌లల్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే- తన ట్రాక్ రికార్డును సమం చేసినట్టవుతుంది. హైదరాబాద్ గెలిస్తే.. ఒక మెట్టు పైకెక్కినట్టే అవుతుంది. తనకంటే బలమైన ప్రత్యర్థిని ఎలా నిలువరించగలుగుతుందనేదే డౌట్.

రెండు సీజన్లలో 40కి పైగా సగటు, 140కి పైగా స్ట్రైక్ రేట్‌ను సాధించింది అయిదుమంది ప్లేయర్లే. వారిలో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నారు. ఒకరు సంజు శాంసన్. అతని బ్యాటింగ్ యావరేజ్ 54.50, స్ట్రైక్ రేట్ 145.33గా ఉంటోంది. మరొకరు జోస్ బట్లర్. 43 సగటుతో 159.25 స్ట్రైక్ రేట్‌ను అందుకున్నాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడిదే టీమ్‌లో ఉన్నారు. ఎలాంటి బ్యాటర్నయినా ఇబ్బందులకు గురి చేయగల సత్తా వారి సొంతం.

Story first published: Tuesday, March 29, 2022, 11:14 [IST]
Other articles published on Mar 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+