SRH: హైదరాబాద్‌కు సడన్ షాక్..ఆ ఆల్‌రౌండర్ అవుట్: కుదురుకుందనుకునే లోపే..!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ గెలుపులతో దూసుకెళ్తోన్న గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు బ్రేకులు వేసింది. సోమవారం రాత్రి నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జట్టును చిత్తు చేసింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది కేన్ సేన.

తొలుత బౌలింగ్‌లో..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్లల్లో సత్తా చాటారు. క్యాచ్‌లను జారవిడుస్తూ ఫీల్డింగ్‌లో కొంత తడబాటును ప్రదర్శించినప్పటికీ.. దాని బ్యాడ్ ఇంపాక్ట్ అనేది జట్టును పెద్దగా ప్రభావితం చేయలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను 20 ఓవర్లల్లో 162 పరుగులకే కట్టడి చేశారు సన్‌రైజర్స్ బౌలర్లు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మార్కొ జెన్‌సెన్, టీ నటరాజన్, ఉమ్రాన్ మలిక్ వికెట్లను తీసుకున్నారు.

సడన్ షాక్
అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని విఘాతం తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టు దూరం అయ్యాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండట్లేదు. ఎన్ని మ్యాచ్‌లకు అతను దూరం అవుతాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. కనీసం రెండు వారాల పాటు అతను విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు వారాల వ్యవధిలో జరిగే మ్యాచ్‌లల్లో వాషింగ్టన్ సుందర్ ఆడకపోవచ్చు.

గ్రౌండ్‌ను వీడి..
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఫలితంగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లే వేశాడు. అర్ధాంతరంగా డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను ఎయిడెన్ మార్క్‌రమ్ పూర్తి చేశాడు. సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయం అయినట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

వెంటాడుతున్న గాయాలు..
ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అతను వేలిగాయంతో బాధపడ్డాడు. ఆ సీజన్‌తో పాటు భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కూ దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడు. సుందర్.. కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవచ్చని హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ ధృవీకరించారు. అతని స్థానంలో శ్రేయాస్ గోపాల్ లేదా జగదీష్ సుచిత్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

రాహుల్ త్రిపాఠి పరిస్థితేంటీ?
బ్యాటర్ రాహుల్ త్రిపాఠి పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో అతను గాయపడ్డాడు. రిటైర్డ్ హర్ట్‌గా క్రీజ్‌ను వీడాడు. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 17 పరుగులు చేసి, ఊపు మీదున్న దశలో త్రిపాఠి వెనుదిరగాల్సి వచ్చింది. అతని గాయం చిన్నదేనని, దీని పట్ల పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని, తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడనీ టామ్ మూడీ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications